Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రోబో చిరుత ..

Category : world

చిరుత పులుల వేగం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. వేగానికి మారుపేరు చిరుతలు. ఇప్పుడు అచ్చం చిరుతలాగే పరుగులు తీసే ఒక రోబోను నెదర్లాండ్స్‌ శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి చేశారు. దాని పొడవు 30 సెంటీమీటర్లు. బరువు 2.5 కేజీలు. చిరుత పులులు వేగంగా పరిగెత్తడం, ఎక్కువ దూరం గంతులు వేయడంలో వాటి వెన్నెముక ముఖ్యపాత్ర పోషిస్తుందని తమ విశ్లేషణలో తేలినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. దాని అనుగుణంగా అచ్చం వాటి వెన్నెముక లాగానే పనిచేసే స్ప్రింగ్‌ను రోబోలో అమర్చినట్లు తెలిపారు. అలాగే చిరుతల కండరాల్లో అధిక శక్తి నిల్వ ఉంటుంది, దానివలన అది ఆలా పరుగెడుతోంది. అందుకే రోబో కాళ్లలోనూ కొన్ని స్ప్రింగులను ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. దీంతో అచ్చం నిజమైన చిరుత కదలికలను తలపిస్తూ రోబో పరుగులు తీస్తోందని వివరించారు. ప్రస్తుతం ఈ రోబో గంటకు ఒక కిలోమీటరు వేగంతో పరిగెత్తుతోందని, ఇంత చిన్న పరిమాణంలో ఉండే రోబోకు ఆ వేగం ఎక్కువేనని తెలిపారు. ఆరోగ్యరంగం, ఇంటిపనుల్లో ఉపయోగించుకునే భవిష్యత్తుతరం రోబోల తయారీలో తమ ఆవిష్కరణ కీలకంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.

Related News