//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రోబో 2 .o ట్రైలర్ రివ్యూ అరాచకం అంతే

Category : movies

మొదట్లో రిలీజ్ అయినా టీజర్ పెద్దగా ఆకట్టుకోలేదు అని భావించిన శంకర్ దానికి ఎక్స్టెన్షన్ గా ట్రైలర్ రిలీజ్ చేసింది రోబో టీం. సూపర్ స్టార్ రజిని, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించించి. పొరపాటున హాలీవుడ్ ట్రైలర్ ఏమైనా తెలుగు రిలీజ్ చేసేశారా ఏంటి అనిపిస్తుంది ఈ ట్రైలర్ చుసిన తరువాత.హాలీవుడ్‌ స్థాయి గ్రాఫిక్స్‌తో రూపొందిన ఈ ట్రైలర్‌ రజిని కాంత్ అభిమానులను మరో లెవల్ కి తీసుకుని వెళ్ళింది. ముఖ్యంగా సెల్ ఫోన్స్ మాయం అయ్యే సీన్ ని ఒక భారి పక్షి విధ్వంశం సృష్టించే సీన్లను హాలివుడ్ స్థాయిలో చూపించారు శంకర్.

సెల్ ఫోన్ వాడుతున్న అందరూ హంతకులు , సెల్ ఫోన్ చూడగానే మరణ భయం తో అందరూ చెల్లాచెదురు అవుతారు చూడు అనే సంభాషణను తో ఎంట్రీ ఇచ్చాడు అక్షయ్. ఒక ముక్కలో చెప్పాలంటే అక్షయ్ పెర్ఫార్మన్స్ అరాచకం అంతే. భారీ విజువల్ ఎఫెక్ట్స్ , యాక్షన్ ఎపిసోడ్స్ హాలీవుడ్ కి ఏమాత్రం తీసిపోలేదు.

అమీ జాక్సన్ మరో సారి తన గ్లామర్ తో పడగొట్టింది. రజిని , అమీ తో WOW అని చెప్పిన రజిని స్టైల్ ప్రేక్షకులచేత కూడా WOW అనిపిస్తుంది. ట్రైలర్ చివర్లో వచ్చే అక్షయ్ , రజిని మధ్య షాట్స్ ట్రైలర్ కె హైలైట్ గా నిలిచాయి. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 29 న మనముందుకు వస్తుంది.