//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బాహుబలి రికార్డులను పటాపంచలు చేసిన 2 .ఓ

Category : movies

రజిని - శంకర్ కామ్బినషన్ లో భారీ అంచనాల మధ్య విడుదలైన రోబో 2 .ఓ. విడుదలైన ప్రతి చోట సూపర్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది చిట్టి. తెలుగు , తమిళ్ , హిందీ భాషల్లో రిలీజ్ అయినా ఈ చిత్రం కల్లెక్షన్ తో దుమ్ము లేపుతుంది. తమిళ్ , తెలుగు భాషల్లో కంటే హిందీ లోనే అద్భుత ఆధరణ అందుతుంది.

దానికి కారణం ఎక్కడ మన సౌత్లో 3d థియేటర్స్ అందుబాటులో లేకపోవటమే. హిందీ లో అత్యధిక థియేటర్స్ ఉన్నాయ్. తెలుగు , తమిళ్ లో 3d థియేటర్స్ అంతగా లేని కారణంగా సినిమా సౌత్లో కంటే నార్త్ లోనే అదరగొడుతుంది. హిందీ లో బాహుబలి రికార్డులను కేవలం 5 రోజుల్లోనే పటాపంచలు చేసింది చిట్టి రోబో. హిందీ వెర్షన్ 'బాహుబలి' ఫుల్ రన్ లో 117 కోట్ల షేర్ ను వసూలు చేసింది. '2.ఓ' హిందీ వెర్షన్ కేవలం 5 రోజుల్లోనే 120 కోట్ల షేర్ ను రాబట్టి సరికొత్త రికార్డును నమోదు చేసింది.

అయితే ఈ సినిమా 'బాహుబలి 2' రికార్డును అధిగమించడం సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు. ఎందుకంటే 'బాహుబలి 2' హిందీ వెర్షన్ 511 కోట్ల షేర్ ను వసూలు చేసింది. అందువలన ఈ రికార్డును అందుకోవడం అసాధ్యమేనని చెబుతున్నారు. '2.ఓ' ప్రపంచవ్యాప్తంగా 3 భాషల్లోను కలుపుకుని 5 రోజులకు గాను 451 కోట్లను రాబట్టింది.

Related News