//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆర్కే కొత్త పలుకు.. కేసీఆర్ పొలిటికల్ సూసైడ్ చేసుకున్నారు

Category : politics

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తెలంగాణా రాష్ట్రంలో TRS గెలుస్తుందని 80 స్థానాల్లో విజయం సాధిస్తుంది అని ఐదు వారాల కిందట రాసిన…కొత్త పలుకులో చెప్పారు. ఆర్కే రాసిన వ్యాసాన్ని చదివి షాక్ తినటం రాజకీయ వర్గాల పనయ్యింది. అయితే ఇప్పుడు ఆర్కే కొత్త పలుకులో నిజంగానే కొత్త పలుకందుకున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత<a class="md-inline-link" href="https://www.ins.media/breking-news-trs-lady-leader-fire-on-kcr" target="_blank" rel="noopener noreferrer"> KCR.. రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారని తేల్చేశారు. రాజకీయాల్లో హత్యలుండని.. ఆత్మహత్యలుంటాయని… కేసీఆర్.. పరిస్థితి ఆత్మహత్యా సదృశం అని తేల్చి చెప్పారు.

తన అహంకార ధోరణితో ముందుకు పోతున్నారన్న ఆర్కే తెలంగాణా ప్రజలు అహంకారాన్ని సహించరని చెప్పారు. KCR ప్రచారం జోరుగా చేసినా కూటమి ప్రచారంలో వెనకబడినా కూటమికి ఆదరణ, గులాబీ దళానికి వ్యతిరేఖత పెరిగిపోతుందని చెప్పారు. KCR పై ప్రజల్లో ఉన్న అరవై ఐదు శాతం సానుకూలత పోయిందని చెప్పిన ఆయన నేరుగా కేసీఆర్ ఓడిపోతున్నారని చెప్పకనే చెప్పారు.

ఈ సందర్భంలో గతంలో ఇలాగే ముందస్తుకు వెళ్ళిన వాళ్ళ పరిస్థితి గుర్తు చేశారు. కేబినెట్ మొత్తాన్ని డిస్మిస్ చేసిన… ఎన్టీఆర్‌ను కల్వకుర్తిలో ఓడించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే జరగోబోతోందన్నట్లుగా కొత్తపలుకుల్లో ఆర్కే తేల్చేశారు. స్వయంకృత అపరాధం చేస్తుందని అందుకే గులాబీ పార్టీ ఓటమి చవి చూసే అవకాశం వుందని ఆయన తెలిపారు.Chandrababu పొత్తు కోసం ముందుకు వచ్చినా కాదు పొమ్మన్న కారణం, బాబును ఎడాపెడా నోటికి వచ్చినట్టు తిట్టిన కారణమే బాబు జాతీయ రాజకీయాల్ల ఎదుగుదలకు, కేసీఆర్ పతనానికి కారణమని చెప్పారు.

చివరగా Chandrababu ఇప్పుడు కేసీఆర్ గెలుపోటముల్ని శాసించే స్థితిలోకి వచ్చారని చెప్పిన ఆర్కే మొత్తానికి టీఆర్ఎస్ పతనం ఖాయం అయినట్టే అని చెప్పి కేసీఆర్ ను షాక్ కు గురి చేశారు..

Related News