//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

స్పీకర్ కి తప్పిన ప్రమాదం

Category : state politics

తెలంగాణా శాశన సభ స్పీకర్ మధుసూదనా చారికి పెను ప్రమాదం తప్పింది. భూపాలపల్లి జిల్లా గణపురంలో స్పీకర్ మధుసూదనాచారి రాత్రి పల్లె నిద్ర చేశారు. పర్యటనను ముగించుకుని తిరిగి వస్తుండగా దేవాదుల పైపులను తీసుకువస్తున్న రెండు లారీలు ఎదురుగా వస్తున్న స్పీకర్ కాన్వాయ్ వాహనాలను ఢీకొట్టాయి. బలంగా ఢీకొట్టడంతో వాహనం రోడ్డు కిందకు వెళ్లిపోయింది.

అయితే ఈ ప్రమాదంలో స్పీకర్ మధుసూదనాచారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు స్పీకర్‌ను క్షేమంగా అక్కడి నుంచి మరో వాహనంలో . ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం నుజ్జనుజ్జు అయ్యింది. అయితే ఈ ఘటనకు కారణం రోడ్డు ఇరుకుగా ఉండటమే అని సమాచారం. అయితే స్పీకర్ కాన్వాయ్ వేగంగా వెళ్తుండటం కూడా కారణమై ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.