//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసన నేడు భారత్ బంద్...!

Category : national politics

ఈ రోజు వేకువజామునుండే భారత్ బంద్ కొసాగుతుంది . వాహనాలని ఎక్కడికక్కడే నిలిపివేశారు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్, విపక్షాలు ఈ రోజు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. రూపాయి విలువ పతనం, ప్రపంచ చమురు ధరల పెరుగుదల నడుమ ఆదివారమూ వీటి పెరుగుదల కొనసాగింది.

పెట్రోలుపై లీటరుకు 12 పైసలు, డీజిలుపై 10 పైసలు వరకూ పెరుగుదల కనిపించింది , చమురు ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్షాలు ఈ రోజు భారత్ బంద్‌ను కొనసాగిస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీతో పాటు డీఎంకే, ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీఎస్ సహా 21 ప్రధాన విపక్షాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులు బంద్‌లో పాల్గొంటున్నట్లు కాంగ్రెస్‌ తెలిపింది. బంద్ సందర్భం లో ప్రభుత్వాలు వాహనాలని తిప్పాలని ప్రయత్నం చేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు అని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు .

Related News