//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

"లక్ష్మీస్ ఎన్టీఆర్" అబద్ధపు అభిమానులకు ....ఆర్జీవీ హెచ్చరిక

Category : movies

సంచలన దర్శకుడు ఆర్జీవీ తాజాగా తెరకెక్కిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఎన్ని వివాదాలకు,విమర్శకు కేరాఫ్ అడ్రెస్స్ అవుతుందో అందరికి తెలిసింది. అయితే తాజాగా ఈ రోజు కొన్ని గంటల క్రితం రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది.

ఆ పోస్టులో వివాదాస్పద రీతిలో, ట్వీట్ చేస్తూ తన చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కు రామ్ గోపాల్ వర్మ ఫ్రీ పబ్లిసిటీ చేసుకుంటున్నారు.

ఈ ట్వీట్ లో 'ఎన్టీఆర్ అబద్ధపు అభిమానులారా, వెన్నుపోటుకు నిజమైన అభిమానులారా, రేపు పొద్దున్నే మీ మీ ఇళ్ళకి దగ్గరలో ఉన్న గుళ్ళలో ఆంజనేయస్వామికి ఆకు పూజ చేసి రెడీగా ఉండండి. ఉదయం 9:27 గంటలకల్లా మీ ముందుకు లక్ష్మీస్ ఎన్టీఆర్ టీజర్ ప్రత్యక్షం కాబోతోంది. మీ కన్నీళ్ళకి నేను బాధ్యుడిని కాదు.' అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్ ను విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని కూడా తనదైన శైలిలోనే వర్మ ప్రకటించారు.

Related News