//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

లక్ష్మీస్ ఎన్టీర్ సినిమాకు సెన్సార్ షాక్ ... రివర్స్ షాక్ ఇచ్చి రిలీజ్ చేస్తా అంటున్న వర్మ

Category : movies

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ పై సెన్సార్ బోర్డు షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ సినిమా రిలీజ్ చేస్తే రాజకీయ పరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని, ఎన్నికలు అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్ చేసుకోవాలని సెన్సార్ బోర్డ్ సూచించింది. అయితే రామ్ గోపాల్ వర్మ తనకు షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డు నిర్ణయంపై కోర్టుకు వెళ్లారట. లైన్ క్లియర్ చేసుకొని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారట.

కాంట్రవర్సియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ సృష్టించిన వివాదాల గురించి తెలిసిందే, అయితే ఈ సినిమా విడుదలకు దగ్గర పడటంతో టీడీపీ సినిమాను విడుదల కాకుండా ఆపాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మొదట విడుదలను ఆపాలంటూ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయగా సినిమా విడుదలను అడ్డుకోలేమంటూ ఎన్నికల కమిషన్ తేల్చేసింది, ఆ తర్వాత సెన్సార్ బోర్డు రంగంలోకి దిగింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను సెన్సార్ కు పంపగా, రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ సినిమా విడుదలైతే రాజకీయపరంగా అభ్యంతరాలు, విమర్శలు వచ్చే అవకాశం ఉందని, ఎన్నికల తర్వాత రిలీజ్ చేయాలని తెలిపింది సెన్సార్ బోర్డు.

సెన్సార్ బోర్డుకు వ్యతిరేకంగా వర్మ కోర్ట్ ను ఆశ్రయించి సినిమా విడుదలకు లైన్ క్లియర్ చేసుకున్నట్లు, సెన్సార్ బోర్డు సినిమా రిలీజ్ కు అవసరమైన ప్రాసెస్ ను కూడా మొదలు పెట్టినట్లు వర్మ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఈ క్రమంలో అన్నీ అనుకూలిస్తే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఈ నెల 29కి విడుదల అవుతుందని సమాచారం అందుతుంది.

Related News