//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అమర జవాన్ల కుటుంబాలకు గంభీర్ మరో సహాయం..

Category : sports

ఛత్తీస్‌గఢ్‌లోని సుకమా జిల్లాలో మావోయిస్టుల కాల్పుల్లో చనిపోయిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల పిల్లల చదువుకు అయ్యే ఖర్చును గౌతమ్ గంభీర్ ఫౌండేషన్ భరిస్తోందని ప్రకటించిన గౌతమ్ గంభీర్ మరోక సారి వారి కుటుంబాలకు చేయూతనివ్వనున్నాడు. ఐపీఎల్‌లో భాగంగా ఈడెన్‌గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌- దిల్లీ డేర్‌డెవిల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో, జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన గంభీర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా గంభీర్ మాట్లాడుతూ... ఇప్పటి నుంచి ఐపీఎల్‌లో నేను అందుకునే అవార్డుల ద్వారా దక్కే నగదు మొత్తాన్ని సుకమా జిల్లాలో మావోయిస్టుల కాల్పుల్లో మృతి చెందిన జవాన్ల కుటుంబాలకు అందజేస్తాను అని గంభీర్‌ ప్రకటించాడు. జవాన్ల పిల్లల చదువుకు సంబందించిన విషయాలపై తన ఫౌండేషన్ ఇప్పటికే పని ప్రారంభించామని గంభీర్‌ తెలిపాడు.