//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హరీష్ కు సీఎం అయ్యే గోల్డెన్ ఛాన్స్ .. రేవూరి షాకింగ్ కామెంట్స్

Category : politics

హరీష్ రావుపై TDP పోలిట్ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి షాకింగ్ కామెంట్ చేశారు. తన వ్యాఖ్యలతో కొత్త చర్చకు తేరా తీశారు రేవూరి .TRS, ప్రజా కూటమికి సమానంగా సీట్లు వస్తే అందులో కొందరిని తీసుకొని Harish Rao సీఎం అవుతారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. హరీష్ రావుకు సీఎం అయ్యే అవకాశం వుంది అని చెప్పి ఆయన కూటమిలో సీఎం అభ్యర్థిగా ఆయన పేరు ప్రస్తావించారు. టీఆర్ఎస్‌లో అంతర్యుద్ధం జరుగుతోందన్నారు.Revuri shocking Comments: Harish Rao Next Telangana CM

సోమవారం నాడు ఆయన వరంగల్‌లో మీడియాతో మాట్లాడారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికుంటే హరీష్ రావు Congress పార్టీ చేరి ఉండేవారని ఆయన గుర్తు చేశారు. సరైన సమయం కోసం హరీష్ రావు ఎదురుచూస్తున్నారని చెప్పిన రేవూరి హరీష్ కు పార్టీ లో ప్రాధాన్యత లేదని చెప్పుకొచ్చారు.Revuri shocking Comments: Harish Rao Next Telangana CM

ఎన్ని అవమానాలు ఎదురైనా విధిలేకే హరీష్ రావు TRS లోనే కొనసాగుతున్నారని రేవూరి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.KCR అభద్రతాభావంలో ఉన్నారని రేవూరి అభిప్రాయపడ్డారు.కొడుకు, కూతురికే కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారని రేవూరి ప్రకాష్ రెడ్డి గుర్తు చేశారు. ఈ కారణంగానే హరీష్ రావు సమయం కోసం ఎదురు చూస్తున్నాడని రేవూరి చెప్పారు.అభద్రతా భావంలో ఉన్న హరీష్ మంచి అవకాశం వస్తే పార్టీ మారతాడని జరగబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పర్భుత్వం ఏర్పాటు కాకుండా అలాంటి ప్రయత్నం సైతం జరుగుతుందని చెప్పకనే చెప్పారు రేవూరి ప్రకాష్ రెడ్డి .Revuri shocking Comments: Harish Rao Next Telangana CM

Related News