//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తిరగబడిన ఇసుక లారీ 8మంది దుర్మరణం...!

Category : national

మధ్యప్రదేశ్‌లోని అలిరాజ్‌పూర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున ఇసుక లోడుతో వెళ్తున్న ఓ లారీ తిరగబడడంతో 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

అందులో ఓ మహిళ కూడా ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. అల్లు గ్రామం వద్దకు రాగానే లారీ చక్రం ఒకటి మురుగుకాలువలో ఇరుక్కోవడంతో ట్రక్కుమొత్తం తిరగబడినట్టు ఏఎస్పీ సీమా అలవా వెల్లడించారు. ప్రమాదం జరిగినప్పుడు లారీలో మొత్తం 16 మంది కార్మికులు ఉన్నట్టు తెలిపారు. తిరగబడిన వాహనం కింద పలువురు కార్మికులు చిక్కుకోవడంతో ప్రాణనష్టం భారీగా జరిగిందన్నారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. గాయపడిన వారిని సమీపంలోని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామనీ... ఘటనపై కేసు నమోదు చేసి ఇప్పటికే విచారణ ప్రారంభించామని సీమా పేర్కొన్నారు.