//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రేమలో క్రికెటర్ భువనేశ్వర్.

Category : sports

భారత జట్టు క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ ప్రేమలో పడినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. 'వంకాయ ఫ్రై' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచితమైన హీరోయిన్ అనుస్మృతితో భువనేశ్వర్ కుమార్ ప్రేమాయణం నడుపుతున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ మధ్య కాలంలో ఈ జంట పబ్బుల్లో కనిపించడం, కారులో ఒకరిపక్కన ఒకరు కూర్చుని షికారుకు వెళుతూ కెమెరాలకు చిక్కారు. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతోందని సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు. త్వరలోనే వీరిద్దరి పెద్దల అనుమతితో వివాహం చేసుకునే అవకాశం కూడా లేకపోలేదని సినీ పండితులు అప్పుడే జోస్యం కూడా చెప్తున్నారు. అంతేగాకుండా భువనేశ్వర్, అనుస్మృతిల జంట చూసేందుకు బాగుందని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వీరి పెళ్లిపై సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద చర్చే కోనసాగుతోంది.