//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బాబుకు రేవంత్ ఆఫర్ ఏంటో తెలుసా....!

Category : politics

రాజకీయాలలో రోజు తిరిగే లోపు సమీకరణాలు మారిపోయుంటాయి. రాజకీయనేతలు కూడా రాత్రికి రాత్రే పార్టీ లు మారుతుంటారు. కొన్ని సార్లు నమ్మలేని విషయాలను కూడా రాజకీయనాయకులు నిజం చేసి చూపిస్తూవుంటారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి చెబుతున్న మాటలు కూడా ఇలాగే ఉన్నాయి. రేవంత్ చెబుతున్న మాటలు వింటే ఈ పరిణామాలు ప్రస్తుత రాజకీయాల్లో ఊహించడం సాధ్యమా అనిపిస్తుంది.

రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.' చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టడానికి ఉత్సాహపడుతున్నారని , చంద్రబాబు తమనువదిలి కాంగ్రెస్ వైపు వెళుతున్నాడని భారతీయ జనతా పార్టీ వారికి తెలిసిపోయిందని అయన అన్నారు . అందుకని వారు కేసీఆర్ ను వాడుకుంటున్నారు . ఆ కారణం తో ఆయన ఇప్పుడు మూడో ఫ్రంట్ అనే పేరుతో ఉన్నవీ లేనివీ ప్రచారంలోకి తెస్తున్నాడు అని , కేసీఆర్ మాటలన్నీ కూడా బీజేపీ ముందస్తు ప్రణాళికతోనే మాట్లాడుతున్నారని' వ్యాఖ్యానించాడు.

ఈ విమర్శల వల్ల మరీ మోకాలికీ బోడిగుండుకీ ముడిపెట్టినట్టు కూడా కాదు, అరికాలికీ బోడిగుండుకీ ముడిపెట్టినట్టుగా ఉన్నదని పలువురు రేవంత్ ఫై జోకులు వేసుకుంటున్నారు.

రేవంతా రెడ్డి టీడీపీ నుండి కాంగ్రెస్ లో జాయిన్ కావడానికి రాహుల్ గాంధీని ఆశ్రయించి నప్పుడు తాను టీడీపీ నుండి చాల మంది ముఖ్య నాయకులను తెస్తాను అని చెప్పి అయన కాంగ్రెస్ లో ముఖ్య పదవులను ఆశించాడని అనుకుంటున్నారు. తీరా చూస్తే టీడీపీ నుండి ఎవ్వరు జాయిన్ అవ్వలేదు రేవంత్ కి సరైన పదవి దక్కలేదు. ఇప్పుడు రేవంత్ ఏకంగా చంద్రబాబునే కాంగ్రెస్ కూటమిలోకి తెచ్చేస్తున్నా అంటూ కొత్త ప్రగల్భాలను ఇండైరక్టుగా ప్రారంభించాడని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే టీడీపీ పార్టీ పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకత వల్ల , దీని వల్ల కాంగ్రెస్ పార్టీ కూటమిలోకి చంద్రబాబు మొగ్గుతున్నాడనే ఆలోచన రేవంత్ కు ఎలా వచ్చిందో అనుకుంటున్నారు. పచ్చకామెర్ల వాడికి లోకం పచ్చగా కనిపించినట్లుగా, అయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే సరికి, అందరూ కాంగ్రెస్ తీర్థమే పుచ్చుకుంటారని అనిపిస్తున్నదేమో అని అనుకుంటున్నారు . ఇంతేకాక కాంగ్రెస్ కూటమిలోకి రావాల్సిందిగా చంద్రబాబుకు రేవంత్ రెడ్డే ఏదైనా ఆఫర్ ఇచ్చి ఉంటాడని కూడా నవ్వుకుంటున్నారు.

Related News