//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కెసిఆర్ బీజేపీ బంటు అంటున్న రేవంత్ రెడ్డి

Category : politics national

రాహుల్ హైదరాబాద్ లో ఓయూ లో జరగనున్న ఒక కార్యక్రమానికి హాజరవుతుండడంతో, తెరాస నేతలు
ఓయూలో రాహుల్ టూర్ ను అడ్డుకుంటామని అంటున్నారు. దమ్ముంటే రాహుల్ పర్యటనను అడ్డుకోండి మా దమ్మెంటో చూపిస్తామని రేవంత్ హెచ్చరించారు. నేనే ముందుండి నడుస్తా చేతనైతే రాహుల్ ను అడ్డుకోవడానికి హరీష్ కేటీఆర్ రావాలని వారిని తొక్కిపడేసైనా సరే రాహుల్ ని ఓయూ పర్యటన చేయించి తీరుతామన్నారు.

కేసీఆర్ బిజెపికి మద్దతిస్తుంటే ఎంఐఎం కేసీఆర్ కు మద్దతు ఎందుకు ఇస్తుందో ఆలోచన చేయాలని మైనారిటి సోదరులను కోరారు. టిఆర్ ఎస్ , ఎంఐఎం కలిసి మైనారిటిలను మోసం చేస్తున్నాయని దీనిని మైనారిటి సోదరులు ఆలోచించాలని కోరారు. కరుణానిధి మరణించినప్పుడు కేసీఆర్ అదానీ పొంత విమానంలో చైన్నై వెళ్లాడని దీంతోనే వారి మధ్య దోస్తి అర్ధం చేసుకోవచ్చని ఆయన విమర్శించారు. మోదీకి కేసీఆర్ కు మధ్యగా అనుసంధాన కర్తగా అదానీ వ్యవహరిస్తున్నాడని రేవంత్ అన్నారు. కేసీఆర్ తన స్వంత ప్రయోజనాలక కోసం తెలంగాణ ప్రజల జీవితాలను బలిస్తున్నాడని రేవంత్ దుయ్యబట్టారు. తన పిల్లలను ఏసీ గదుల్లో పెట్టి పేద పిల్లలను రోడ్డు మీద పెట్టడం కేసీఆర్ కు అలవాటని రేవంత్ విరుచుకుపడ్డారు. రాష్రంలో జరుగుతున్న పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారని కేసీఆర్ కుటుంబాన్ని తరిమే రోజు దగ్గర్లోనే ఉందన్నారు . ప్రజలే వారికి బుద్ది చెబుతారని కేసీఆర్ కూలిపోవడం ఖాయమని రేవంత్ అన్నారు..