//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైవిధ్యంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి

Category : politics

లోక్‌సభ సమావేశాల రెండో రోజు కూడా సభ్యుల ప్రమాణస్వీకారం ఇంకా కొనసాగుతోంది.దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం అయిన మల్కాజిగిరి నుంచి 17వ పార్లమెంటుకు ఎన్నికైన కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి లోక్‌సభలో ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు.అయితే తొలిసారి ఎంపీగా ఎన్నికైన రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం రోజే తన యొక్క వైవిధ్యాన్ని సభలో ప్రదర్శించారు.మిగతా సభ్యుల్లా పేపర్లలో రాసిన ప్రతిజ్ఞ కాకుండా వెరైటీగా మొబైల్ ఫోన్‌లో చూసి తెలుగులో చదువుతూ రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.ప్రమాణస్వీకారం కోసం రేవంత్ లేచి వస్తున్న సమయంలో ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు బల్లలు చరుస్తూ ఆహ్వానించడం సభలో విశేషం.పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు ఏపీకి చెందిన వైసీపీ,టీడీపీ ఎంపీలు ప్రమాణస్వీకారం చేయగా రెండో రోజు తెలంగాణకు చెందిన కాంగ్రెస్,టీఆర్ఎస్,బీజేపీ ఎంపీలు ప్రమాణస్వీకారం చేస్తున్నారు.