//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆ సీట్ల‌లో అభ్య‌ర్థుల‌ను గెలిపించే బాధ్య‌త నాది.. కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి స‌వాల్‌..!

Category : politics

తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌రంలో కాంగ్రెస్ నుంచి రెబ్‌స్టార్స్‌ లెవ‌ల్లో టీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తున్న రేవంత్ ముందు పెద్ద స‌వాల్ వ‌చ్చి ప‌డింద‌ట‌. త‌న ప్ర‌ధాన అనుచ‌రులంద‌రికీ టిక్కెట్ ఇవ్వాల‌ని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేస్తున్నార‌ట‌. అనుకున్న‌విధంగా త‌న‌వ‌ర్గం మొత్తానికి టిక్కెట్లు ఇప్పించ‌డంలో రేవంత్‌రెడ్డి స‌క్సెస్ అవుతారా..? లేదా..? అన‌్న‌ది ఇప్పుడు పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింద‌ట‌.

కాంగ్రెస్‌లో చేరే వేళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి త‌న వ‌ర్గానికి కొన్ని టిక్కెట్లు ఇవ్వాల‌న్న ష‌ర‌తు రేవంత్‌పెట్టార‌ని, అందుకు కాంగ్రెస్ అధిష్టానం అంగీక‌రించింద‌ని పార్టీ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుతున్నాయి. ఆచ‌ర‌ణ‌లో దాన్ని ఎంత వ‌ర‌కు రేవంత్ సుసాధ్యం చేస్తార‌న్న‌ది ఇప్పుడు అస‌లు ప్ర‌శ్న‌గా మారింది. వేం న‌రేంద్ర‌రెడ్డి, సీతక్క‌, అరికెల న‌ర్సిరెడ్డి, ప‌టేల్ ర‌మేష్‌రెడ్డి, విజ‌య ర‌మ‌ణారావు ఇలా చాలా మంది రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరు కాక మ‌రికొంత మంది నేత‌లు కూడా చేరారు. వీరంతా కాంగ్రెస్‌లో రేవంత్ టీమ్‌గానే కంటిన్యూ అవుతున్నారు. టీఆర్ఎస్ మీద‌, కేసీఆర్ మీద అగ్రెస్సివ్‌గా అటాచ్ చేస్తూ అతి త‌క్కువ కాలంలో తెలంగాణ కాంగ్రెస్‌లో కీల‌క నేత‌గా ముద్ర వేయ‌గలిగారు రేవంత్‌రెడ్డి.

దీంతో ఆయ‌న అనుచ‌వ‌ర్గం అంతా త‌మకు టిక్కెట్ గ్యారెంటీ అన్న ధీమాలో ఉన్నారు. ప‌ది టిక్కెట్ల‌ను డిమాండ్ చేస్తున్న రేవంత్‌రెడ్డి ఒక్క టిక్కెట్ కూడా త‌గ్గ‌డానికి వీల్లేద‌ని తేల్చి చెబుతున్నారు. విజ‌యాల‌తో వీర‌విహారం చేస్తున్నా.. ప‌రాజ‌యంతో మునిగిపోయినా కాంగ్రెస్‌లో స‌హ‌జంగా ఒక ల‌క్ష‌ణం ఎప్పుడూ సంద‌డి చేస్తూనే ఉంటుంది. అదే గ్రూప్ పాలిటిక్స్‌.

ఇప్పుడు రేవంత్‌రెడ్డికి ప‌ది టిక్కెట్లు ఎలా ఇస్తారు..? అన్న కోణంలోనూ గ్రూప్ పాలిటిక్స్ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అయితే, త‌న అనుచ‌ర‌వ‌ర్గం మొత్తాన్ని గెలిపించుకునే బాధ్య‌త త‌న‌ద‌ని వారి విజ‌యం సంగ‌తి తాను చూసుకుంటాన‌ని త‌న‌కు ప‌ది టిక్కెట్లు ఇవ్వాల్సిందేన‌ని రేవంత్‌రెడ్డి గ‌ట్టిగా చెబుతున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ డిమాండ్‌ను నెర‌వేరుస్తుందా..? లేక కొర్రీలుపెట్టి నాలుగైదు టిక్కెట్ల‌తో స‌రిపెడుతుందా... అన్న‌ది పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రేవంత్ టీఆర్ఎస్ మీద దూకుడుగా ఎటాక్ చేస్తున్న వేళ ఆయ‌న అడిగిన‌న్ని ఇక్కెట్లు ఇవ్వ‌కుంటే ఎలా స్పందిస్తార‌న్న చ‌ర్చ కూడా న‌డుస్తుంద‌ట‌. మొత్తం మీద త‌న వ‌ర్గం వారంద‌రికీ టిక్కెట్లు ఇప్పించ‌డంలో రేవంత్ ఏ మేర‌కు విజ‌యం సాధిస్తార‌న్న కోణం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఆస‌క్తిని రాజేస్తుంది.

Related News