//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రేవంత్ విడుదల ...కారణం రేపు చెప్తాం....!

Category : politics

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని పోలీసులు విడుదల చేశారు. జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నుంచి భారీ భద్రత మధ్య ఆయనను కొడంగల్ కు తరలించారు. మరోవైపు కొడంగల్ లోని రేవంత్ నివాసం వద్దకు భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. కేసీఆర్ సభ నేపథ్యంలో, ఉద్రిక్తతలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రేవంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

నిన్న అర్ధరాత్రి ఆయనను అరెస్ట్ చేసి, జడ్చర్లకు తరలించారు. రేవంత్ ను విడుదల చేయాలని కాసేపటి క్రితమే డీజీపీని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ఆదేశించారు .

రేవంత్ అరెస్ట్ పై కాంగ్రెస్ కోర్టుని ఆశ్రయించారు . విచారణ చేపట్టిన కోర్ట్ రేవంత్ రెడ్డిని అర్ధరాత్రి అరెస్ట్ చెయ్యాల్సిన అవసరం ఏముందని పోలీసులను కోర్టు ప్రశ్నించింది. పోలీసుల తీరుపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అరెస్టుకు కారణాలు రేపు సమర్పిస్తామని ఉన్నత న్యాయస్థానానికి ఏజీ తెలిపారు. దీంతో విచారణను రేపటికి వాయిదా వేసింది న్యాయస్థానం.

Related News