//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తెలంగాణ నెక్స్ట్ సీఎం రేవంతేనా ....!

Category : politics

ప్రస్తుతం దేశం మొత్తం తెలంగాణ లో జరుగుతున్న ఎన్నికల గురించే చర్చ నడుస్తుంది . కెసిఆర్ ముందస్తు ఎన్నికలకి తెర తీసి అందరిని షాక్ కి గురిచేస్తే , టీడీపీ , కాంగ్రెస్ కలిసి తెరాస కి కోలుకోలేని షాక్ ఇచ్చాయి . ఈ నేపథ్యం లో ఎన్నికలు రసవత్తకరంగా మారాయి . తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కొడంగల్ అభ్యర్థి రేవంత్ రెడ్డిని మంగళవారం తెల్లవారుజామున అరెస్ట్ చేసిన పోలీసులు హైకోర్టు ఆదేశాలతో సాయంత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్‌ను కొడంగల్‌లో కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం నబీ అజాద్ సైతం రేవంత్ నివాసానికి వెళ్లారు.

ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ. అధికారం ఎన్నటికీ శాశ్వతం కాదని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను పరోక్షంగా హెచ్చరించారు. అధికారంలో ఉన్నామని కళ్లు నెత్తికి ఎక్కకూడదని, కాళ్లు నేలపైనే ఉండాలని సూచించారు. రేవంత్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు కేసీఆర్ రేవంత్ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

అధికారం ఎన్నది ఎన్నటికీ శాశ్వతం కాదనీ, ఈ రోజు సీఎం పీఠంపై కేసీఆర్ ఉన్నారు.. రేపు అదే కుర్చీపై రేవంత్ రెడ్డి కూడా ఉండొచ్చని వ్యాఖ్యానించారు. రేవంత్ సీఎం అవ్వొచ్చని ఆజాద్ అనగానే ఆయన అనుచరులు, అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది.

మరోవైపు, ఆజాద్ వ్యాఖ్యలు టీకాంగ్రెస్ లో కలకలం రేపాయి. ఆయన ఉద్దేశపూర్వకంగా అలా అన్నారా.. లేక మాటల సందర్భంలో వచ్చాయా అనేది చర్చించుకుంటున్నారు. ఇక పొతే దాదాపుగా మహాకూటమి అధికారంలోకి వస్తే , రేవంత్ సీఎం అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి . చూడాలి మరి రేవంత్ జోరుకి కాంగ్రెస్ ఏ పదవి ఇచ్చి ఋణం తీర్చుకుంటుందో ..

Related News