Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కేసీఆర్ ఒక దగుల్బాజీ, దోపిడీదారుడు ...!

Category : politics state

తెలంగాణ లో మరో నాలుగు రోజుల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి . ప్రచారం కూడా చివరికి వచ్చింది . అన్ని పార్టీల వారు తమ తమ వ్యూహాలతో ఓటర్లని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు . ప్రచారం లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దుమ్మెత్తిపోశారు . తెరాస అధినేతపై పదునైన మాటలతో విరుచుకుపడ్డాడు . కేసీఆర్‌కు తమ పదునేమిటో చూపిస్తామని, పట్టుదల ఏమిటో చూపిస్తామని చెప్పారు.

కేసీఆర్ ఉద్యమకారుడు కాదని దగుల్బాజీ, దోపిడీదారు అన్నారు. నేనే రాజ్యం , రాజ్యమంటేనే నేను అనేలా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారన్నారు అంటూ చెప్పుకొస్తున్నాడు. కొడంగల్ ప్రజలతో గోక్కునేవాడు ఎవడూ రాజకీయంగా బతికి బట్టకట్టలేదన్నారు. గుర్నాథ్ లాంటి వాళ్లే కాలగర్భంలో కలిశారన్నారు. చీటర్లకు కొడంగల్‌లో ప్రవేశం లేదన్నారు. రేవంత్ ఉన్నంత వరకు కొడంగల్‌కు హైటెన్షన్ వైరు కాపలా ఉన్నట్లే అన్నారు. కేసీఆర్ సింహం కాదని గుంట నక్క అన్నారు .

పట్నం నరేందర్ రెడ్డిని గెలిపించాలని రావణాసురుడు బయలుదేరాడని కేసీఆర్‌ను ఉద్దేశించి రేవంత్ మండిపడ్డారు. కేసీఆర్‌కు తాను సవాల్ విసురుతున్నానని, ఒక్కొక్కరు కాదని, అందరూ కలిసికట్టుగా ఒకేసారి రావాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల కురుక్షేత్రంలో కొడంగల్ ప్రజలు పాండవుల పక్షానే నిలబడతారని చెప్పారు. కౌరవుల సేన అయిన కేసీఆర్ వర్గానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కేసీఆర్ ఉద్యమకారుడు కాదని, దగుల్బాజీ, దోపిడీదారు అన్నారు.

కేటీఆర్‌ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. మీ అయ్య గుంటనక్క వేషాలు, మీ బావ తోడేళ్ల వేషాలు వేస్తున్నారని నిప్పులు చెరిగారు. కొడంగల్ ప్రజల అండతో తాను కొండను అయినా ఢీకొంటానని చెప్పారు. కొడంగల్ ప్రజలు అండనే తనకు ఉన్న అతిపెద్ద దైర్యం అని చెప్పారు. తన వెనుక ఉన్నది వారేనని అభిప్రాయపడ్డారు.

కొడంగల్ ప్రజలతో గోక్కున్నవాడు బతికిబట్టకట్టలేదని, గుర్నాథ్ రెడ్డి అంతటి వాడే రాజకీయంగా కాలగర్భంలో కలిశారన్నారు. చింతమడక చీటర్లకు కొడంగల్‌లో ప్రవేశం లేదన్నారు. ఒక్క కేసీఆర్ కాదని, వందమంది కేసీఆర్‌లు వచ్చినా తాను పాతాళానికి తొక్కేస్తానని రేవంత్ రెడ్డి దుమ్ముదులిపారు.

Related News