//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నా విశ్వసనీయతకు పోలికనా?

Category : politics

తెలంగాణలో అధికార - ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం వరుసగా నాలుగోరోజు కూడా కొనసాగింది.

విద్యుత్ సరఫరా - వాటి ఒప్పందాల పై చేస్తున్న వివాదం కొనసాగింది. ఏకంగా అసెంబ్లీ ఎదుట గల అమరవీరుల స్థూపం ఈ సవాళ్లు - ప్రతిసవాళ్లకు వేదికగా మారింది. అధికార టీఆర్ ఎస్ పార్టీ నేతల సవాళ్లపై వివరణ ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించిన రేవంత్ రెడ్డి అన్నట్లుగానే గన్ పార్క్ కు విచ్చేశారు. అయితే టీఆర్ ఎస్ పార్టీ నేతలు హాజరుకాలేదు. దీంతో అక్కడే ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా టీఆర్ ఎస్ నేతల తీరుపై విరుచుకుపడ్డారు.

రాష్ట్రం ప్రభుత్వం చెబుతున్న విద్యుత్ వెలుగుల వెనక అవినీతి జరిగింది నిజమని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. రాష్ట్ర విజన సమయంలో విద్యుత్ కేటాయింపుల విషయంలో నాడు కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్ట్ లతోనే ఇప్పుడు మిగులు సాధ్యమైందని స్పష్టం చేశారు. విద్యుత్ వెలుగుల అవినీతిపై చర్చకు రెడీ అని సవాల్ విసిరిన టీఆర్ ఎస్ నేతలు ఎటుపోయారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

`టీఆర్ ఎస్ సవాల్ స్వీకరించే ఇప్పుడు గన్ పార్క్ దగ్గరికి వచ్చాం. ఇరవై నాలుగు గంటలు గడవకముందే టీఆర్ ఎస్ వెనక్కి పోయింది. నా విశ్వసనీయతకు పోలికనా? నాడు ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని పోలవరం కాంట్రాక్టులు దక్కించుకున్న కేసీఆర్ ను బయటపెట్టింది నేనే` అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

వాస్తవాలు మాట్లాడేందుకు తాను సిద్ధమని రేవంత్ ప్రకటించారు. `అమరవీరుల కుటుంబాల దగ్గరకో - ఉస్మానియా యూనివర్సిటీకో నేను వెళతాను...కేసీఆర్ వస్తారా?విశ్వసనీయత ఉంటే కేసీఆర్ రావాలి. అప్పుడు ఎవరి విశ్వసనీయత ఏంటనేది తెలుస్తుంది. తెలంగాణ ఇచ్చిన సోనియాకు కాళ్ళు మొక్కిన కేసీఆర్ విశ్వనీయత జనంకు తెలుసు` అని రేవంత్ వ్యాఖ్యానించారు. దొంగతనం బయటపడుతుందనే చర్చకు ముఖం చాటేశారని రేవంత్ వ్యాఖ్యానించారు.

` మేం లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. బీహెచ్ ఎల్ కు టెండర్లు పిలవకుండా 30400కోట్ల పనులు ఎందుకు ఇచ్చారో చెప్పాలి. బీహెచ్ ఈఎల్ తో తన బినామీలకు కేసీఆర్ పనులు ఇప్పించుంటున్నారు. ఈ నిర్ణయంతో జెన్కో కు ఐదు వేల కోట్ల నష్టం వచ్చింది. ఈ నష్టాన్ని కేసీఆర్ భరిస్తారా?మంత్రి భరిస్తారా??` అని నిలదీశారు.