//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రశ్నించే గొంతుకు పట్టం కట్టారు...కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు...

Category : state politics national

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత ఆ పార్టీ భవిషత్తు ప్రశ్నార్థకం అవుతుందని. అనుకున్న వారికి మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 17 పార్లమెంట్ సీట్లకు కు గాను 4 ఎంపి స్థానాలు గెలుచు కునీ తమకు తిరుగులేదని నిరూపించింది.అంతే కాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హేమా హేమీ సీనియర్ నాయకులు సైతం ఓడిపోవడం. టీఆర్ఎస్ పార్టీ తమ విజయంగా మార్చుకోవడం చూసాం. ఇన్నాళ్లు ఓటమి బాధతో ....ఆ పార్టీ సామర్ధ్యం కొంత మేర దెబ్బ తినడం తో వెనకడుగు వేసిన ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్ రేవంత్ రెడ్డి...మళ్లీ టీఆర్ఎస్ పార్టీ పై తన పంజా విసిరాడు.

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి తిరస్కరణ మొదలయిందన్నారు మల్కాజ్‌గిరి ఎంపీ గా గెలిచిన రేవంత్ రెడ్డి. సిద్దిపేట, సిరిసిల్లలో తగ్గిన మెజార్టీలే టీఆర్ఎస్ పతనానికి సంకేతమని ఆయన తెలిపారు. బుధవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బహిరంగ లేఖరాసిన రేవంత్ రెడ్డి..గులాబీ దళంపై విమర్శలు గుప్పించారు. మల్కాజ్‌గిరిలో రేవంత్ రెడ్డి గెలుపు ఓ గెలుపేనా..అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత 4 నెలల వ్యవధిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 20 లక్షల ఓట్లు తగ్గిపోయాయి. మీ సొంత గడ్డ సిద్దిపేట, మీరు ప్రాతినిధ్యం వహిస్తోన్న సిరిసిల్లలోనే మెజారిటీలు పడిపోవడం టీఆర్ఎస్ పతనానికి సంకేత మవుతుందనీ ఆయన చెప్పు కొచ్చారు.

అంతే కాకుండా స్వయాన కరీంనగర్, నిజామాబాద్‌లలో మీ కుటుంబ సభ్యులు ఓడిపోవడం. టీఆర్ఎస్ గ్రాఫ్ వేగంగా పడిపోతోందనడానికి ఇదే మంచి సంకేతం అని ఆయన అన్నారు.మల్కాజ్‌గిరి ప్రజలు ప్రశ్నించే గొంతుకు పట్టం కట్టారనీ. ప్రజలను అవమానించేలా మాట్లాడటం కేటీఆర్ అహంకారానికి నిదర్శనమంటూ తీవ్ర స్థాయిలో రేవంత్ విరుచుకుపడ్డారు. 2009 సిరిసిల్ల ఎన్నికల్లో కేటీఆర్ కేవలం 171 ఓట్లతోనే గెలిచిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు రేవంత్ .కాగా, లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి గెలిచిన విషయం తెలిసిందే. 10,919 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిపై రేవంత్ రెడ్డి భారీ విజయం సాధించారు.