//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రేవంత్ అరెస్ట్ ... పోలీసులు చెప్పిన కారణం ఇదే !

Category : politics state

ఎన్నికల కి మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది . ఇటువంటి తరుణం లో తెలంగాణ లో ఉద్రికత్త వాతావరణం ఏర్పడింది . కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు , రాష్ట్ర కాంగ్రెస్‌లో ఫైర్‌ బ్రాండ్‌ నేత , రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నేడు కొడంగల్‌లో జరగనున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభను అడ్డుకుంటానని హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా రేవంత్‌ను అరెస్ట్ చేసారు .

సీఎం కేసీఆర్‌ ఈ రోజు కొడంగల్‌లో నిర్వహించనున్న బహిరంగ సభను అడ్డుకునేందుకు రేవంత్‌ ప్రయత్నిస్తున్నారని ఈసీకి నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ నాయకులు ఫిర్యాదు చేశారు.

రేవంత్‌ ఇక్కడి స్థానికులని రెచ్చగొడుతున్నారని, కొడంగల్‌ బంద్‌కు పిలుపునిచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈసీ ఆదేశాలతో ఐపీసీ సెక్షన్లు 341, 188, 506, 511 కింద కొడంగల్‌ పోలీసు స్టేషన్‌లో రేవంత్‌పై కేసు నమోదు చేసినట్లు అదనపు డీజీపీ జితేందర్‌ తెలిపారు.

రేవంత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారు అనే విషయం కూడా తెలపడం లేదని రేవంత్ భార్య ఆందోళన చెందుతుంది. ఇంటి తలుపులు బద్దలు కొట్టి పోలీసులు వచ్చినట్లు రేవంత్ అనుచరులు తెలుపుతున్నారు. పోలీసుల తీరుపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము ఏమైనా ఉగ్రవాదులమా అంటూ పోలీసులపై మండిపడుతున్నారు .

Related News