//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రేవంత్ వ్యూహానికి సైకిల్, కారు బేజారు?

Category : editorial

కాంగ్రెసులో అడుగు పెట్టక ముందే తన పని మొదలు పెట్టేశాడు రేవంత్ రెడ్డి. టీడీపీ,టీఆర్ఎస్ లకు గుక్క తిప్పుకోలేని రీతిలో మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసాడు.

2019 ఎన్నికల్లో తెలంగాణను దున్నేసేందుకు సిద్ధమవుతున్న ఈ రెండు పార్టీలకు చెక్ చెప్పే వ్యూహంతో రాజకీయ చదరంగాన్ని రేవంత్ ప్రారంభించారు. తాను టీడీపీలోనే ఉన్నాను. కాంగ్రెసులో చేరలేదంటూనే హస్తం పార్టీకి చక్కగా ఉపయోగపడే పాచికను అందించారు. టీడీపీ, టీఆర్ ఎస్ అంటకాగడం వల్ల తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయనే కోణంలో రాజకీయాస్త్రాన్ని సంధించారు. బహిరంగంగా విమర్శలు గుప్పించుకుంటున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు లోలోపల కుమ్మక్కవుతున్నాయన్న భావన ధ్వనించేలా రేవంత్ మొదటి బాణం విడిచారు. దీంతో ఈనెల 26 న చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత టీటీడీపీ వర్కింగు ప్రెసిడెంటు పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజకీయ మర్యాద కోసం అధినేతతో వీడ్కోలు సమావేశం జరిపి, పార్టీ అనుబంధాన్ని ముగించవచ్చని రేవంత్ సన్నిహిత వర్గాల సమాచారం. ఈలోపుగానే అందుకు తగిన ప్రాతిపదికను సిద్ధం చేసుకుంటున్నారాయన. ఢిల్లీలో కాంగ్రెసు అధిష్టానాన్ని కలిసి వచ్చిన తర్వాత మీడియాను ఒక రోజుపాటు దూరంగా ఉంచిన రేవంత్ మరుసటి రోజే ఇందుకు సంబంధించి స్పష్టత నిచ్చారు. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు, ఉప ఎన్నికల్లో కాంగ్రెసుతో కలిసి పనిచేశాం. ఇప్పుడు ఆ పార్టీ నాయకత్వంతో కలిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. అన్యాపదేశంగా కాంగ్రెసు అగ్రనాయకత్వంతో భేటీని ధ్రువీకరించారు. మూడో వంతు సీట్లు ఇస్తే కాంగ్రెసుతో కలిసి పోటీ చేసేందుకు టీడీపీ సిద్దంగా ఉంది. ఇందుకు సంబంధించి కాంగ్రెసుతో మాట్లాడుతున్నామని కూడా ఆయనే ప్రకటించేశారు. ఇవన్నీ చంద్రబాబుకు తెలిసి జరుగుతున్నాయో, లేదో ఎవరూ చెప్పలేరు. రేవంత్ మాత్రం తెగేదాకా లాగాలని నిర్ణయించేసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే తనంతతానుగా కాకుండా అధిష్టానమే తనను బహిష్కరించేలా పావులు కదుపుతున్నట్లుగా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Related News