//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అసెంబ్లీ ఘటన పై రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు..!

Category : politics

నిన్న అసెంబ్లీ లో జరిగిన ఘటన ఫై రేవంత్ రెడ్డి తెరాస ఫై తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారమే మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఆస్పత్రిలో చేరారని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులకు అండగా ఉండేందుకే అసెంబ్లీలో మేం నిరసన తెలిపాము అన్నారు. అయితే హెడ్‌ఫోన్స్‌ ఎవరికి తగిలాయో ఎందుకు చూపెట్టడంలేదని రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

నిన్న గవర్నర్‌ ప్రసంగంలో రైతుల ఆత్మహత్యలు, పంటలకు గిట్టుబాటు ధరల ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, సంపత్‌కు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని ఆయన అన్నారు.

Related News