//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రక్షణ శాఖకు రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి ‘కోటి’ విరాళం

Category : national

రిటైర్డ్ బ్యాంకు అధికారి రక్షణ శాఖపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఉదార స్వభావంతో రక్షణ శాఖ నిధికి రూ. కోటి విరాళంగా ఇచ్చారు. గుజరాత్‌కు చెందిన రిటైర్డ్ బ్యాంకు అధికారి జనార్ధనభాయ్ భట్, ఆయన భార్య కోటి రూపాయల చెక్‌ను రక్షణ శాఖ అధికారులకు అందజేశారు. తన వారసత్వం లేకపోవడంతో తన జీవిత కాలంలో జమ చేసిన డబ్బును రక్షణ శాఖకు విరాళంగా ఇవ్వాలని ఆ దంపతులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే రక్షణ శాఖ నిధికి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు.