అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పర్చుకోవడానికి అవసరమైన గ్రీన్ కార్డు జారీలో ఒకొక్క దేశానికి కోటా నిర్ణయించే ప్రస్తుత పద్దతి పట్ల రిపబ్లికన్ పార్టీ సభ్యుడు కెవిన్ యోదెర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రతీ దేశానికి ఒకే నిష్పత్తిలో కేటాయింపు కారణంగా భారత్, చైనా వంటి దేశాలకు చెందిన వృత్తి నిపుణులకు కేటాయింపులో అన్యాయం జరుగుతుందని ఆయన విచారం వ్యక్తం చేశారు.
అట్లా కాకుండా, అమెరికాలో తాత్కాలిక వీసాపై ఉద్యోగం చేస్తున్న విదేశీయులకు నైపుణ్యం, దరఖాస్తుల ఆధారంగా గ్రీన్‌కార్డులు మంజూరు చేయాలని, ప్రస్తుతమున్న కోటా విధానాన్ని రద్దు చేయాలని అమెరికన్ చట్టసభ ప్రముఖుడైన ఆయన డిమాండ్ చేశారు.