Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

3 లక్షల లోపు ఆదాయం ఉన్నవాళ్లకు అద్దె ఇళ్లు..

Category : politics

రెండోసారి కూడా అద్భుత మెజార్టీతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశాన్ని అన్ని రంగాల్లోనూ పరుగులు పెట్టించే నిర్ణయాలు ఉంటాయని అందరూ భావిస్తున్నారు.అలాగే,ఇప్పుడు మోడీ ప్రభుత్వం సామాన్యులపై కూడా దృష్టి సారిస్తోంది.అందులో భాగంగానే అసంఘటిత కార్మికులకు పెన్షన్,ఆరోగ్యం కోసం మోడీ కేర్,మరియు అలాగే రైతుల కోసం కిసాన్ సమ్మాన్.ఇలా ఎన్నో పథకాలను తీసుకు వచ్చింది ఇంకా తీసుకువస్తోంది కూడా.మోడీ ప్రభుత్వం ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లోని పేదలు,వలస వచ్చిన కార్మికుల అభ్యున్నతిపై దృష్టి సారిస్తోందినరేంద్ర మోడీ ప్రభుత్వం తాజాగా ఇంతకు ముందెన్నడూ లేని సరికొత్త హౌసింగ్ ప్లాన్‌తో ముందుకు రానుందని తెలుస్తోంది.

సొంతూళ్లలో ఇంటిని వదిలేసి,మెట్రో నగరాల్లో అద్దెకు ఉంటున్న వలస కార్మికులు లేదా పేదవారి కోసం సింగిల్ రూంలు నిర్మించి,చాలా తక్కువ ధరకు అద్దెకు ఇచ్చే ప్లాన్‌లో ఉందని తెలుస్తోంది.మెట్రో నగరాల్లో మురికివాడలు పెరుగుతున్నాయి.వీటిని తగ్గించడంతో పాటుగా కార్మికులకు అందుబాటులో సింగిల్ రూమ్ ప్లాట్ల నిర్మాణం చేపట్టాలని కేంద్ర గృహ,పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యోచిస్తోందని తెలుస్తుంది ఏడాదికి రూ.3 లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి వీటిని అద్దెకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలుస్తోంది.ఇందుకోసం ఎత్తైన అపార్టుమెంట్లను (సింగిల్ ప్లాట్ అపార్టుమెంట్) నిర్మించడంతో పాటు అందులో నల్లా ద్వారా నీటిని సరఫరా చేస్తారు.ఒక్కో ప్లాట్‌కు ఒక మరుగుదొడ్డి (అటాచ్డ్ టాయిలెట్) వంటి సౌకర్యాలను నిర్మించనున్నారు.ప్రభుత్వం ఇలా నిర్మించడం ద్వారా పట్టణ ప్రాంతాల్లో స్లమ్ ఏరియాలు తగ్గడంతో పాటు పేదవారికి కూడా కొంచెం ప్రయోజనంగా ఉంటుంది.

Related News