//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రెనో డస్టర్‌లో కొత్త పెట్రోల్‌ ఆటోమేటిక్‌ వెర్షన్‌

Category : national business

రెనో ఇండియా పెట్రోల్‌ ఇంధనంగా నడిచే కొత్త ఆటోమేటిక్‌ వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఢిల్లీలో దీని ఎక్స్‌షోరూమ్‌ ధర 10.32 లక్షల రూపాయలు. పెట్రోల్‌ ఇంధనంగా నడిచే 6 స్పీడ్‌ మాన్యువల్‌ వెర్షన్‌లో కొత్త మోడల్‌ను కూడా మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ వెర్షన్‌లో ఆర్‌ఎక్స్‌ఇ ధర 8.49 లక్షలు కాగా ఆర్‌ఎక్స్‌ఎల్‌ ధర 9.30 లక్షల రూపాయలు. కొత్తగా ప్రవేశపెట్టిన 6 స్పీడ్‌ ఎక్స్‌ ట్రానిక్‌ సివిటి గేర్‌బాక్స్‌తో వచ్చింది. 1.5 లీటర్‌ పవర్‌ట్రెయిన్‌, స్టీరింగ్‌కే అమర్చిన ఆడియో, ఫోన్‌ కంట్రోల్స్‌, గేర్‌ షిఫ్ట్‌ ఇండికేటర్‌ దీని ప్రధాన ఫీచర్లు. తమ కార్ల శ్రేణిలో డస్టర్‌ కీలక పాత్ర పోషిస్తుందని, కొత్త మోడల్‌ను ఆవిష్కరించడంతో ఈ శ్రేణి మరింతగా విస్తరించిందని రెనో ఇండియా సిఇఒ సుమిత సాహ్ని అన్నారు. భారతలో డస్టర్‌ను ప్రవేశపెట్టిన నాటి నుంచి 1.6 లక్షల కార్లను విక్రయించినట్టు సాహ్ని చెప్పారు.