//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వాహనాలపై కాదు... మనస్సులో నుండి తొలిగించాలి.

Category : national

వీఐపీ సంస్కృతిని పూర్తిగా తొలిగించేందుకే ఎర్రబుగ్గలను నిషేధించినట్లు ప్రధాని మోదీ చెప్పారు. వీటివలన కొందరిలో తాము వీఐపీలం అని భావిస్తున్నారని, ఎర్రబుగ్గలను తొలగించినట్లే, మనసులో ఉన్న వీఐపీ ఫీలింగ్ ని తీసివేయాలని మోదీ పిలుపునిచ్చారు. దేశంలోని 125 కోట్ల మందీ ప్రముఖులే అని స్పష్టం చేశారు. ఈ నిషేధం సోమవారం నుండి అమల్లోకి వస్తున్నది. మోదీ ఆదివారం మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో మాట్లాడారు. ‘‘ఎర్రబుగ్గ వాడడం వీఐపీ సంస్కృతికి ప్రతీకగా మారింది. వాహనం పై భాగంలో వాడే ఎర్రబుగ్గతో సంబంధిత వ్యక్తుల బుర్రలోకి వీఐపీ సంస్కృతి నాటుకుపోతోంది.’’ అని చెప్పారు. అలాగే ‘‘ప్రతి ఒక్కరూ ముఖ్యులే.. ప్రతి ఒక్కరికీ విలువ ఉంది. దేశంలోని 125 కోట్ల మంది ప్రాముఖ్యాన్ని మనం గుర్తిస్తే కలల సాకారానికి దేశానికి ఎంత బలం చేకూరుతుందో వూహించండి. మనమందరం ఈ పని కలిసికట్టుగా చేయాలి.’’ అని అన్నారు.