//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఐఐటీ లను టార్గెట్ చేసిన మత ప్రచార కర్తలు

Category : national state

అన్యమత ప్రచారం, మత మార్పిడి ఇప్పుడు ఈ మాటలు చాలా ప్రాంతాల్లో వింటున్నాం. అంతక ముందు తిరుపతి లో కొంతమంది జనాన్ని మత మార్పిడి చేయిస్తున్నటు విన్నాం. తాజాగా కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో మత ప్రచారం జరుగుతున్నదనే విషయం కలకలం రేపుతోంది.

అక్కడ ఉన్న అధికారుల అండతో తల్లిదండ్రుల ముసుగులో క్యాంపస్‌లోకి ప్రవేశించిన మత ప్రచారకులు హాస్ట్‌ల్ గదుల్లో ప్రార్థనలు నిర్వహించారు. మత ప్రచారానికి ఓ ఉన్నతాధికారి భార్య, అధ్యాపకులు అండగా ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే ఆర్జేయూకేటీ అధికారులు తక్షణం చర్యలు తీసుకున్నారు.

ఈ వ్యవహారానికి సంబంధించి ఐదుగురు సిబ్బందిని సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మత మార్పిడి పెద్ద నేరం అని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ కొందరు డబ్బు కోసం, పదవుల కోసం మత మార్పిడి చేసుకుంటున్నారు.

Related News