//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రస్తుతానికి జీఎస్టీతో ఈ-కామర్స్ ఉపశమనం

Category : business

మరో మూడు రోజులలో అమలులోకి రానున్న జీఎస్టీతో ఈ-కామర్స్ సంస్థలకు ప్రస్తుతానికి ఉపశమనం లభించింది. టీడీఎస్, టీసీఎస్ నిబంధనల అమలును ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం  ప్రకటించింది. తద్వారా ఈ-కామర్స్ సంస్థలపై ఒక శాతం పన్ను టీసీఎస్‌ను వసూలు చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ టీడీఎస్, టీసీఎస్ అమలులోకి వస్తే కొనుగోలుదారుడిపై ప్రభావం పడనున్నది. 

వాణిజ్యం, పరిశ్రమల వర్గాల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా సీజీఎస్‌టీ/స్టేట్ జీఎస్టీ చట్టం 2017 ప్రకారం టీడీఎస్, టీసీఎస్‌కు సంబంధించి నిబంధనలను అమలును ప్రస్తుతానికి కేంద్రం నిలుపుదల వేయాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. చారిత్రక పన్ను సంస్కరణ జీఎస్టీ కోసం ఈ-కామర్స్ కంపెనీలు, పంపిణీదారులకు మరింత ఎక్కువగా సమయం ఇవ్వడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

వచ్చే నెల 1 నుంచి అమలులోకిరానున్న జీఎస్టీ చట్ట ప్రకారం ఈ-కామర్స్ సంస్థలు అమలు చేయాల్సి ఉంది. రూ.20 లక్షల లోపు చిన్న, వ్యాపార సంస్థలు జీఎస్టీ కింద నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ-కామర్స్ సంస్థలు అందించే ఏ ఉత్పత్తిపై ఎలాంటి పన్నును విధించడం లేదు.