//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రిలయన్స్ జియో టారిఫ్ రేట్లు పెరిగాయ్‌

Category : business

టెలికాం రంగంలో ప్రవేశించినప్పటి నుంచి జియో ఏది చేసినా సంచలమే. ఆ కంపెనీ భారత్‌లో ఉద్భవించడమే ఆలస్యం టెలికాం రంగం కుదుపునకు గురైంది. ఆ తర్వాత ఉచిత డేటా, కాల్స్‌తో ఈ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది ముఖేశ్ అంబానీ సంస్థ. ఆ పై జియో ఫీచర్ ఫోన్‌తో మరోసారి వినియోగదారులను ఆకర్షించింది. అయితే అంతా బాగానే ఉంది. కస్టమర్లు జియోకు బాగా అలవాటుపడ్డారు. ఫ్రీ డేటా అల్లా.. ఇప్పుడు మూడు నెలలకు రూ.399 ప్లాన్ అయింది. భవిష్యత్‌లో ఇది ఒక నెలకు చేసినా ఆశ్చర్యం లేనది అంటున్నారు. అయితే ఒక్కొక్కరి లెక్కలు ఒక్కోలా ఉంటే.. జియో మాత్రం ఒక్కసారిగా 24% టారిఫ్ రేట్లను పెంచేసి కస్టమర్లను ఆశ్చర్యానికి గురిచేసింది.దీనికి సంబంధించిన ముఖ్య విషయాలను తెలుసుకుందాం.

ప్రైమ్ కస్టమర్లు రూ.399తో రీచార్జి చేసుకుంటే రూ.400 సమానమైన వోచర్లు ఇచ్చి 100% క్యాష్ బ్యాక్ వచ్చే సదుపాయాన్ని ఆస్వాదించే లోపే మొత్తం జియో కస్టమర్లకు సంబంధించి రిలయన్స్ జియో పిడుగు లాంటి వారత్ చెప్పింది. అక్టోబర్ 19 నుంచి జియో అన్ని రీచార్జీ ప్లాన్లలో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా రూ.309, రూ.409, రూ.509, రూ.799, రూ.799 ప్లాన్లలో మార్పులు జరిగాయి.

రూ.309 రీచార్జీ చేసుకుంటే ఇకపై 28 రోజుల పాటు 30జీబీ డేటా వస్తుంది. రోజువారీ పరిమితి 1జీబీ, రూ.409 రీచార్జిపై మొత్తం 20జీబీని 28 రోజుల పాటు అందిచనున్నారు. రోజువారీ పరిమితి లేదు.84 రోజుల ప్లాన్ ఇది వరకూ రూ.399 ఉండేది. దీని ధరలను ఇప్పుడు రూ.459 కు పెంచారు. రూ.509 స్కీమ్‌ ప్రయోజనాలను తగ్గించింది. అంతే కాకుండా బిల్లింగ్‌ సైకిల్‌ను 56 రోజుల నుంచి 49కు కు తగ్గించామని పేర్కొంది. ఇక రూ.999 ప్లాన్‌లో గతంలో ఆఫర్‌ చేసిన 90 జీబీ 4 జీ డేటాను 30 జీబీకి తగ్గించామని తెలిపింది.

రియలన్స్ జియోను జనాలు ఎందుకు వాడుతున్నారు? ఈ ప్రశ్నను సూటిగా అడిగితే వచ్చే సమాధానం ఒకటే.. మిగిలిన ఆపరేటర్ల కంటే తక్కువ ధరకు డేటా ఇవ్వడంతో పాటు కాల్స్‌, మెసేజ్‌లు ఇవ్వడం వల్లే! కానీ అదే జియో ధర పెంచితే ఏమవుతుంది? జనానికి నమ్మకం పోతుంది. నెమ్మదిగా ఆ సంస్థ చేతిలో ఇరుక్కున్నామన్న ఆలోచన వస్తుంది. ఇప్పుడు జియో త్వరలోనే 24 శాతం టారిఫ్ పెంచితే అటు డేటా, ఇటు కాల్స్‌, మేసేజ్‌లు మునుపటిలా చవకగా అయితే రావు. అప్పుడు ఈ నెట్‌వర్కే వాడాలని రూల్ ఏంటి? ఇప్పటికీ చాలామంది రెండో సిమ్‌గా ఎయిర్‌టెల్‌ను అట్టి పెట్టుకున్నారు. ఒకవేళ ధరే పెరిగితే ఇన్నాళ్లు జియో ఎంజాయి్ చేసిన నంబర్‌వన్ స్థానానికి ముప్పు వాటిల్లినట్లే. వాళ్ల హనీమూన్ ముగిసినట్లే.

జనాలు ఇప్పుడు బాగా వాడుతున్న జియో ప్లాన్ ఏంటంటే రూ.399. మూడు నెలల పాటు వాయిస్ కాల్స్‌, మెసేజ్‌లతో పాటు రోజుకు 1జీబీ డేటా ఇచ్చే ఈ ప్లాన్‌కు కస్టమర్లు బాగా అలవాటు పడిపోయారు. రీఛార్జ్‌లు చేయించుకుని మరీ ఈ ప్లాన్‌లోనే కంటిన్యూ అవుతున్నారు. ఇటీవలే జియో రూ.399తో రీఛార్జ్ చేయించుకుంటే అంతే మొత్తం ఉచితంగా వస్తుందని కూడా ప్రకటించింది. అయితే టారిఫ్‌ల ధరలు పెరిగిన నేపథ్యంలో జియో కూడా ధరలను పెంచక తప్పదని మార్కెట్ నిపుణులు అంటున్నారు. కొద్ది రోజుల్లోనే జియో కొత్త ప్లాన్‌ను వెలువరించే అవకాశాలున్నాయనేది వారి మాట. జియో ద్వారా ఇప్పటికే రూ.270 కోట్ల నికర నష్టం వచ్చినట్లు ఇటీవలే ప్రకటించిన జియో.. మరి కొద్దిరోజుల్లో ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరం.