జియో దెబ్బతో టెలికాం రంగంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఏ నెట్వర్క్ వాళ్లు వారి వినియోగదారుల కోసం కొత్త కొత్త ఆఫర్లతో మార్కెట్లోకి వస్తున్నారు. తాజాగా వొడాఫోన్ ఓ భారీ ఆఫర్‌తో వినియోగదారులను ఆకట్టుకోనుంది. వొడాఫోన్ సూపర్ నైట్’ పేరుతో గంటకు కేవలం రూ.6కే అపరిమిత డేటాను ప్రకటించింది. ఐదు గంటలకు రూ.29తో ఈ ప్యాక్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఫలితంగా వినియోగదారులు ఈ ఐదు గంటల్లో అపరిమితంగా 3జీ/4జీ డేటాను ఉపయోగించుకోవచ్చు, డౌన్లోడ్లు చేసుకోవచ్చు. ఈ ప్యాక్‌ను రోజులో ఏ సమయంలోనైనా యాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే రాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 6 గంటలకు మాత్రమే ఉపయోగించుకునే వీలుంటుందని కంపెనీ తెలిపింది. జియో రూ.19 ప్రారంభ ధరతో తీసుకొచ్చిన ప్రిపెయిడ్ రీచార్జ్‌పై వొడాఫోన్ తాజా ఆఫర్ ప్రభావం చూపించే అవకాశం ఉందని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. కాగా, వొడాఫోన్ సూపర్‌నైట్ ప్యాక్‌ను రిటైల్ అవుట్ లెట్ల ద్వారా కానీ, *444*4#కు డయల్ చేయడం ద్వారా కానీ యాక్టివేట్ చేసుకోవచ్చు.