//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎయిర్‌టెల్‌పై ట్రాయ్‌కు జియో ఫిర్యాదు

Category : national business

భారతీ ఎయిర్‌టెల్‌ తమ సొంత చందాదార్ల విషయంలోనూ వివక్ష చూపుతోందని, తప్పుదోవ పట్టించే ప్రకటనలు జారీ చేస్తోందని రిలయన్స్‌ జియో ఆరోపించింది. ఒకే పథకంలో ఉన్న చందాదార్లకు వేర్వేరుగా, ఇష్టం వచ్చిన రీతిలో ఆఫర్ల జారీ ద్వారా టారిఫ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తోందని పేర్కొంది. వినియోగదారులను తప్పుదోవ పట్టించే విధంగా రూ.293, రూ.499 పథకాలను ప్రకటించి, మార్కెటింగ్‌ చేస్తున్న ఎయిర్‌టెల్‌పై భారీ మొత్తం జరిమానా విధించాలని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ను జియో కోరింది. రోజుకు 1జీబీ చొప్పున 70 రోజుల పాటు డేటా వినియోగించుకోవచ్చని చందాదార్లు భావించేలా ఎయిర్‌టెల్‌ ప్రకటనలు ఉన్నాయని జియో ఆరోపించింది. అయితే నిర్దేశించుకున్న ద్వంద్వ ప్రమాణాలకు అనుగుణంగా లేని చందాదార్లకు కేవలం 50ఎంబీ డేటా మాత్రమే రోజుకు ఇస్తోందని తెలిపింది. ఇది తెలియని చందాదార్లు అదనంగా డేటా వినియోగించుకుంటే 1జీబీ రూ.4000 చొప్పున ఛార్జి చేస్తోందని జియో పేర్కొంది.