//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మళ్లీ జియోదే అగ్రస్థానం

Category : national business

ఇండియాలో ఫాస్టెస్ట్ నెట్‌వర్క్ మాదేనంటూ ఊదరగొడుతున్న ఎయిర్‌టెల్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఈ ఏడాది మార్చ్ నెలలో సగటు డౌన్‌లోడ్ 4జీ స్పీడ్ రిలయన్స్ జియోదే అధికమని టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది.

జియో సగటు వేగం 16.48 ఎంబీపీఎస్‌ కాగా, ఐడియా సెల్యులార్‌ 8.33 ఎంబీపీఎస్‌, భారతీ ఎయిర్‌టెల్‌ 7.66 ఎంబీపీఎస్‌ వేగాన్ని సాధించినట్లు తెలిపింది. వొడాఫోన్‌ 5.66 ఎంబీపీఎస్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) 2.64, టాటా డొకొమొ 2.52, బీఎస్‌ఎన్‌ఎల్‌ 2.26, ఎయిర్‌సెల్‌ డౌన్‌లోడ్‌ వేగం 2.01 ఎంబీపీఎస్‌ వేగం ఉన్నట్లు తెలిపింది. మైస్పీడ్‌ యాప్‌తో ఈ వేగాన్ని లెక్కించినట్లు ట్రాయ్‌ పేర్కొంది.