గతంలో ప్రకటించిన సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ గడువు ముకేశ్ అంబానీకి చెందిన టెలికం వెంచర్ రిలయన్స్ జియో పలురకాల ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. కంపెనీ వెబ్సైట్లో ఉన్న సమాచారం మేరకు రూ.19 నుంచి రూ.9,999 లోపు ప్రీపెయిడ్ ఆఫర్లు ఉన్నాయి.
గతంలో ప్రకటించిన జియో ధన్ ధనా ధన్ ఆఫర్ రూ.309 ప్లాన్ కాలపరిమితిని 84 రోజుల నుంచి 56 రోజులకు కుదించింది. ఈ ఆఫర్ కింద రోజుకు 1జీబీ డాటా యథాతంగా అందిస్తున్నది. రూ.349తో రీచార్జ్ చేసుకున్న వారికి 56 రోజుల పాటు 20జీబీ డాటాను, 84 రోజుల కాలపరిమితి కలిగిన రూ.399 ప్లాన్ కింద 84 జీబీ డాటాను అందిస్తున్నది.
అలాగే రూ.509 ప్లాన్ కింద రోజుకు 2జీబీ చొప్పున 56 రోజుల పాటు వాడుకోవచ్చును. రూ.1,999తో రీచార్జి చేసుకున్న వారికి 120రోజుల్లో(నాలుగు నెలలు) 155 జీబీ డాటాను వినియోగించుకోవచ్చును. రూ.4,999 పథకం కింద 210 రోజులు(ఏడు నెలలు) 380 జీబీల డాటా లభించనున్నది. రూ.9,999తో రీచార్జి చేసుకున్నవారికి 390 రోజుల్లో 780 డాటాను వినియోగించుకోవచ్చును.
పోస్ట్-పెయిడ్ కస్టమర్ల కోసం రూ.399తో మూడు నెలల కాలపరిమితి కలిగిన ప్రత్యేక ప్లాన్ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద రోజుకు 1జీబీ డాటాతోపాటు ఆన్లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ, ఎస్ఎంఎస్, రోమింగ్ చార్జీలు లేవు. ఏప్రిల్ చివరి నాటికి కంపెనీకి 11.2 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.