//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వాజ్ పేయికీ బసవతారకం కేన్సర్ ఆసుపత్రి కీ ఉన్న బంధం

Category : national politics

భారత మాజీ ప్రధాని వాజ్ పేయి మృతిపై ప్రముఖ హీరో ఏపీ టీడీపీ ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఒక మహోన్నతమైన రాజకీయ నేతను మనం కోల్పోవడం చాలా బాధాకరమని, జాతీయస్థాయి రాజకీయాలకు తీరని లోటని అన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని బసవతారకం కేన్సర్ ఆసుపత్రి గురించి బాలకృష్ణ ప్రస్తావించారు.

‘మా బసవతారకం కేన్సర్ ఆసుపత్రిని 22 జూన్, 2000 సంవత్సరంలో మహానుభావుడు ప్రధాని వాజ్ పేయి గారి చేతలు మీదగా ప్రారంభించారు. మా నాన్న గారితో ఆయనకు మంచి అనుబంధం ఉండేది. నాడు ఎన్డీఏ ప్రభుత్వంతో కలిసి టీడీపీ క్రియాశీలకంగా పని చేసింది. నాడు దేశ ప్రధానిగా సేవలందిస్తూ ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న సమర్ధుడు ఆయన’ అని బాలకృష్ణ కొనియాడారు.

Related News