Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తమన్నాను పెళ్లి చేసుకుంటా...శృతిహాసన్ అలా ఫిక్స్ అయ్యింది

Category : movies

తాజాగా శ్రుతి హాసన్ తమన్నాతో డేట్ కు వెళ్తానని ,తమన్నానే పెళ్లి చేసుకునేదాన్ని అని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది అగ్ర హీరో కమల్ హాసన్ కూతురిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రుతిహాసన్ నటిగా తన టాలెంట్ నిరూపించుకుంది. అయితే ఈ మధ్యకాలంలో ఆమె సినిమాలకు దూరమైంది. సౌత్ లోఅవకాశాలు లేక బాలీవుడ్ లో ప్రయత్నం మొదలుపెట్టింది.ప్రస్తుతం హిందీలో ఓ సినిమా చేస్తోంది. ఇది ఇలా ఉండగా.. ఇటీవల ఓ చిట్ చాట్ షోకి హాజరైన శ్రుతిహాసన్ ని హోస్ట్.. ''ఒకవేళ మీరు అబ్బాయి అయితే ఏ హీరోయిన్ తో డేట్ కి వెళ్తారని'' ప్రశ్నించాడు.

దానికి శ్రుతి వెంటనే తమన్నా పేరు చెప్పింది. తమన్నా అంటే తనకు చాలా ఇష్టమని, ఒకవేళ తను అబ్బాయైతే.. తమన్నానే పెళ్లి చేసుకునే దాన్ని అంటూ చెప్పుకొచ్చింది. తమన్నా మంచి అమ్మాయని కితాబిచ్చింది. తమన్నా, శ్రుతిహాసన్ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి పార్టీలు చేసుకోవడం వంటివి చూస్తూనే ఉన్నాం.

మరోసారి తమ మధ్య ఉన్న స్నేహాన్ని వెల్లడించే ప్రయత్నం చేసింది శ్రుతిహాసన్. ఏది ఏమైనా శ్రుతి, తమన్నాల గాఢమైన స్నేహబంధం గురించి ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు.

Related News