//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భార్యని ఆఫ్రికా వ్యక్తితో శృంగారం చేయించేవాడు

Category : world sports

పాక్‌ జట్టుకు ఏకైక వన్డే ప్రపంచక్‌ప ను అందించిన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న ఇమ్రాన్‌ ఖాన్‌ మాజీ రెండో భార్య రేహమ్‌ ఖాన్‌ తను రాసిన ‘రేహమ్‌ ఖాన్‌’ అనే ఆటోబయోగ్రఫీ పుస్తకంలో అక్రమ్‌ శృంగార జీవితంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అక్రమ్‌ తన భార్యతో శృంగారం చేయడానికి ఓ నల్ల జాతీయుడిని ఏర్పాటు చేసి వారిని చూస్తూ ఆనందించేవాడని రేహమ్‌ తీవ్ర ఆరోపణలు చేసింది.

దీన్ని సీరియ్‌సగా తీసుకున్న అక్రమ్‌ ఆమెపై పరువునష్టం దావా వేశాడు. 2009లోనే మరణించిన తన భార్యను ఇలా అగౌరవపరచడం ఆమె నీచస్థాయికి నిదర్శనమని అక్రమ్‌ అన్నాడు. రేహమ్‌ కూడా ఓ తల్లే అయినా డబ్బు కోసం ఏదైౖనా చేసేందుకు సిద్ధంగా ఉందని విమర్శించాడు. ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా ఉన్న ఇమ్రాన్‌ వచ్చే నెలలో జరిగే పాక్‌ ఎన్నికల్లో ప్రధాని పదవికి పోటీపడబోతున్నాడు. ఈ తరుణంలో ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.