టెన్నిస్ అనగానే మైదానంలో చిరుతలా ఉండాలి. ఎక్కడ అలసత్వం ప్రదర్శించినా ప్రత్యర్ధి ఆధిపత్యం ప్రదర్శించే ప్రమాదం ఉంది. దీని కోసం ఆటగాళ్ళు ఫిట్ నెస్ ని పెంచుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మహిళలు అయితే తమ శరీరంపై చాలా దృష్టి పెట్టి కష్టపడుతూ ఉంటారు. అయితే ఒక క్రీడాకారిణి తన శరీరంలో కీలకమైన వక్షోజాలను కూడా తగ్గించుకుంది.
ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది. టెన్నిస్ ఆడేందుకు ఇబ్బందిగా ఉన్నాయని ఆపరేషన్‌తో తన వక్షోజాలను చిన్నవిగా చేయించుకున్నట్టు వరల్ద్ నెంబర్ వన్ సిమోనా హలెప్ వెల్లడించింది. ‘పెద్దవిగా ఉన్న నా వక్షోజాలను టెన్నిస్ కోసం చిన్నవిగా చేయించుకున్నా. ప్రస్తుతం నేను నెంబర్ వన్‌గా ఉన్నానంటే ఆ రోజు అలా మార్పించుకోవడమే కారణం’ అని హలెప్ పేర్కొంది