//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

షియోమీ నుండి మరో అద్భుతమైన ఫోన్..!

Category : business

చైనా మొబైల్ మేకర్ షియోమీ గురువారం మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. రెడ్‌మీ ఎస్2 పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్‌లో ఫ్రంట్ కెమెరా ప్రత్యేక ఆకర్షణ కానుంది. 2మైక్రాన్ పిక్సెల్స్‌తో 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకత.

షియోమీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఫోన్లతో పోలిస్తే ‘ఇది బెస్ట్ రె‌డ్‌మీ సెల్ఫీ ఫోన్’ అవుతుందని కంపెనీ పేర్కొంది. అలాగే, వెనక డ్యూయల్ కెమెరా ఉంది. ఐఫోన్‌లా యాంటెన్నా లైన్స్, షియో వాయిస్ అసిస్టెంట్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఈ ఫోన్ అదనపు ప్రత్యేకతలు.

స్పెసిఫికేషన్లు: 5.99 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 625 ఎస్ఓఎస్ చిప్‌సెట్, 12+5 మెగాపిక్సల్ రియర్ కెమెరా, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఓఎస్, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది.

3జీబీ/32 జీబీ, 4జీబీ/64 జీబీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవసరం మేరకు ఎస్డీ కార్డు ద్వారా మెమొరీని 256 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు ఉంది. 3జీబీ/32 జీబీ వేరియంట్ ధర సుమారు రూ.10,600 కాగా, 4జీబీ/64 జీబీ వేరియంట్ ధర సుమారు రూ.13,700. ఈ నెల 17న ఉదయం పది గంటల నుంచి సునింగ్ డాట్ కామ్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. చాంపేన్ గోల్డ్, ప్లాటినమ్ సిల్వర్, రోజ్ గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉంది