చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షియోమీ సంచలన నిర్ణయం తీసుకుంది.
తాజా స్మార్ట్‌ఫోన్ ‘రెడ్మీ 5ఎ’ను గురువారం మార్కెట్లోకి విడుదల చేసిన షియోమీ ఫోన్ ధర, ఫీచర్లను వెల్లడించింది. 'దేశ్కా స్మార్ట్‌ఫోన్' అంటూ భారత మార్కెట్లోకి షియోమి సంస్థ ప్రవేశపెట్టిన రెడ్మీ 5ఏ స్మార్ట్‌ఫోన్ పేరుకు తగ్గట్లే ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఆకట్టుకునే ఫీచర్లతో, అందుబాటు ధరతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ తొలిసేల్ డిసెంబర్ 7న మధ్యాహ్నం 12 గం.లకు ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్ స్టోర్‌లో ప్రారంభం కానుంది.ఇవాళ జరిగిన విడుదల కార్యక్రమంలో ఈ ఫోన్ ఫీచర్లను, ధరను ప్రకటించారు.
దీని గురించి ప్రత్యేకంగా రెడ్మీ ఇండియా అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు కూడా చేసింది. ఎంఐ వినియోగదారులకు బహుమతి రూపంలో రూ.500కోట్లు తిరిగి వెనక్కి ఇవ్వనున్నట్లు నిర్ణయం తీసుకుని, తొలి 50లక్షల రెడ్మి 5ఏ(2జీబీ 16జీబీ)ను రూ.4,999కే అందించనున్నట్లు రెడ్మీ ఇండియా ప్రకటించింది.
రెడ్మీ 5ఏ ఫీచర్లు
5 అంగుళాల హెచ్డీ తాకే తెర
స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్
2జీబీ ర్యామ్
16జీబీ అంతర్గత మెమొరీ, 128జీబీ వరకు మెమొరీని పెంచుకునే సదుపాయం
5 ఎంపీ, 13 ఎంపీ ముందు వెనుక కెమెరాలు
ఆండ్రాయిడ్ నోగట్, ఎంఐయూఐ 9 వెర్షన్
3000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం