//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గురివిందతో గుప్పెడు లాభాలు....

Category : health

గురువింద అనేది తీగ వంటి చెట్లకు కాస్తాయి.చాల వరకు దేని గురించి తెలియ పోవచ్చు..అవేంటో వాటి ఉపయోగాలేంటో తెలుసుకుందాము... గురివింద గింజలపై ఉండే పెంకును తొలగించి, ఆ పప్పును చూర్ణం చేసి, తగినంత కొబ్బరి నూనె కలపాలి. ఆ ద్రావణాన్ని పేనుకొరికిన చోట రోజూ మూడు పూటలా రాస్తే, ఆ సమస్య తొలగిపోతుంది.

ఆకులను మెత్తగా నూరి నువ్వుల నూనెలో వేసి కాచి, వడగట్టి, ఆ తైలాన్ని ప్రతిరోజూ వెంట్రుకల కుదుళ్లకు పట్టిస్తే, రాలడం ఆగిపోవడంతో పాటు జుత్తు బాగా పెరుగుతుంది.,

ఆకుల రసాన్ని పూతగా పూస్తూ ఓ 15 నిమిషాల పాటు ఎండలో ఉంటే, కొంత కాలంలో తెల్లమచ్చలు (ల్యూకోడర్మా) తగ్గుతాయి.

తెల్ల గురివింద వేరు గంధాన్ని కణతలకు పూస్తే పార్శ్వపు తలనొప్పి తగ్గుతుంది.

కొద్దిపాటి పచ్చి ఆకులను నమిలి తింటూ ఉంటే, బొంగురు గొంతు సమస్య తొలగిపోతుంది.

మూడు గ్రాముల గురివింద వేరు చూర్ణాన్ని పాలతో కలిపి సేవిస్తూ ఉంటే, వీర్యవృద్ధి కలుగుతుంది.

గుప్పెడు ఆకులను ఆముదంతో వెచ్చచేసి కడితే వాపులు తగ్గుతాయి.

పావు లీటరు నువ్వుల నూనెకు 1 లీటరు గుంటగలగర ఆకు రసం, 125 గ్రాముల గురివింద గింజల చూర్ణం కలిపి నూనెలో ఉడికించి లేపనంగా వేస్తే, ఎగ్జిమా, దురదలు, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు, పలురకాల ఇతర చర్మవ్యాధులు నయమవుతాయి.

రెండు గ్రాముల ఆకు చూర్ణానికి సమానంగా, చక్కెర కలిపి సేవిస్తే దగ్గు తగ్గిపోతుంది.