//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇక నుంచి కార్లపై ఎర్రబుగ్గ రద్దు

Category : national state politics

ప్ర‌ధాని మోడీ భారతీయులంద‌రినీ ఆకాశానికి ఎత్తేశారు. ప్ర‌తీ భార‌తీయుడు ప్రత్యేకమైనవాడేనని, భారతీయులందరూ వీఐపీలేనని ఆయ‌న అన్నారు.ఎర్రబుగ్గ కార్లతో అధికారదర్పం ప్రదర్శించే నాయకులు, అధికారులకు చెక్‌ పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్కార్‌ ఎరుపురంగు బుగ్గకార్ల వినియోగంపై ఆంక్షలు విధించింది. దీంతో ప్రతిష్టకు సంకేతంగా భావిస్తూ బుగ్గకార్ల (కార్లపై రెడ్‌లైట్ల)తో వెలిగిపోతున్న పలువురు వీఐపీలు, ఉన్నతాధికారులు ఇకపై ఈ అవకాశాన్ని కోల్పోనున్నారు.భారత రాష్ట్రపతి, ప్రధాని సహా ఏ స్థాయి వ్యక్తి వాహనంపైనా వచ్చే నెల 1 నుంచి ఎర్రబుగ్గగాని, నీలిబుగ్గగాని కనిపించదు. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు, కేబినెట్‌ హోదాలో ఉన్న వ్యక్తులు, అత్యున్నతాధికారుల వాహనాలపై ఈ లైట్లు మాయం కానున్నాయి.

ప్రధాని మోదీ తాజా నిర్ణయంతో వీఐపీ కల్చర్‌కి చరమగీతం పాడినట్లు అయింది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌తో పాటు పంజాబ్‌లో ఎర్రబుగ్గ కార్ల వినియోగంపై అక్కడ ముఖ్యమంత్రులు బ్యాన్‌ విధించిన విషయం తెలిసిందే.అత్యవసర సేవలు అందించే అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు, పోలీసు వాహనాలు లాంటి వాటికి మాత్రమే నీలి దీపాన్ని వాడేందుకు మినహాయింపు ఉంటుంది.