Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కూటమి పార్టీలకు డేంజర్ బెల్ కొడుతున్న రెబల్స్ ... ఏ పార్టీలో ఎందరంటే

Category : politics

Mahakutami కి ఇప్పుడు రెబల్స్ బెడద పట్టుకుంది. ఎప్పుడు ఎవరు ఏం చేస్తారో అన్న ఆందోళన నెలకొంది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు ఉద్భవించిన Mahakutami నేత‌ల‌కు రెబ‌ల్స్ భ‌యం అధిష్టానాన్ని నిద్ర పోనివ్వటం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున ఆశావహులు ఉండటంతో కాంగ్రెస్ నేతలకు చెమటలు పడుతున్నాయి.

పొత్తు నేపధ్యంలో సీట్ల పంప‌కాల విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌తిష్టంభ‌న కొనసాగింది. కానీ తాజాగా సీట్ల ఖ‌రారు అయ్యిందని చెప్పటంతో ఆశావహులు పెద్ద ఎత్తున ఒత్తిడికి దిగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తంమీద ఉన్న 119 స్థానాల‌ను Mahakutami లోని Congress, TDP, TJS , CPI లు పంచుకోవాల్సి ఉంటుంది. అయితే వీటి పంపకాలు జరిగే క్ర‌మంలో సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు ఇబ్బంది ఎదురైతే ఆందోళనలు తప్పవనే టాక్ వినిపిస్తోంది. దీంతో కూట‌మి నేతలు రాబోయే పరిస్థితులను తలచుకొని భయపడుతున్నారట.

Congress పార్టీలో 5 వేల మంది ఆశావహులు పోటీ కి మొగ్గు చూపటం తో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో గుబులు మొదలైంది. అసంతృప్తి రగిలితే KCR కాంగ్రెస్ లోని అసంతృప్త నేతలకు గాలం వేసే అవకాశం వుందని ఆందోళనలో ఉన్ననారు. అయితే దీనిని ముందుగానే గమనించి అసంతృప్తులను బుజ్జ‌గించ‌డం మొద‌లుపెడితే స‌మ‌స్య నుంచి బయటపడవచ్చని పలువురు నేతలు అనుకుంటున్నారట‌.

Mahakutami లో వున్న మిగ‌తా పార్టీల కన్నా, కాంగ్రెస్ కు అసంతృప్తి నేత‌ల నుంచి త‌ల‌నొప్పులు ఎదురవుతాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో ఖచ్చితంగా పోటీకి దిగాల‌ని 5వేల‌ మంది అభ్య‌ర్థులు భావిస్తున్నారట. అయితే వారంద‌రినీ బుజ్జ‌గించ‌డం కాంగ్రెస్ నేతలకు పెను సవాల్ గా మారనుందని సమాచారం. ఇక టీటీడీపీ నుంచి 156 మంది టికెట్ కోసం పోటీప‌డుతున్నారని తెలుస్తోంది. అయితే వీరిలో సీనియ‌ర్లే అత్య‌ధికంగా వుండ‌టం టీడీపీని ఆందోళనకు గురిచేస్తోంది . ఇక సీపీఐ నుంచి 12మంది టికెట్ ఆశిస్తున్నారని తెలుస్తోంది. వీరిలో అంద‌రికీ టికెట్ వ‌స్తుంద‌నే గ్యారెంటీ ఎంతమాత్రం లేదు. ఇక తెలంగాణ జన సమితి నుంచి ఏకంగా 500 మంది టికెట్లు ఆశిస్తున్నారని తెలుస్తోంది. అయితే వారికి సీట్ల కేటాయింపుల్లో 12 నుంచి 15 సీట్లు మాత్ర‌మే వ‌చ్చే అవ‌కాశం వుందని సమాచారం. దీంతో ఆ పార్టీకి అసంతృప్తుల నుంచి భారీస్థాయిలో ఎదురుదాడి త‌ప్ప‌ద‌ని విశ్లేషకులు అంటున్నారు. కూటమిలోని అన్ని పార్టీలకు రెబల్స్ బెడద ఉన్నా కాంగ్రెస్ కు మాత్రం రెబల్స్ బెడద ప్రాణ సంకటంగా ఉంది. మరి కూటమి పార్టీలు అసంతృప్తి సెగలు వ్యాపించకుండా ఆపగలరా లేదా అనేది త్వరలోనే తెలియనుంది.

Related News