//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జగన్ కు తెలంగాణా ప్రభుత్వం భారీ భద్రత కల్పించటం వెనుక మతలబు అదేనా

Category : politics

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి భారీ భద్రతను ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్. ఏపీ ప్రతిపక్ష నేత Jagan పై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో Jagan కు భద్రత కల్పించినట్లు తెలుస్తోంది. Jagan పై దాడి తర్వాత Jagan పై సానుభూతి చూపించిన కేసీఆర్ జగన్ పై జరిగిన దాడిని ఖండించారు. విశాఖ ఎయిర్ పోర్ట్ లో దాడి అనంతరం అక్కడే ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్న Jagan నేరుగా హైదరాబాద్‌కు చేరుకున్నారు.

హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందారు. ఆ సమయంలో కూడా TRS నాయకులు Jagan ను కలిసి పరామర్శించారు. Jagan కు మద్దతుగా ఏపీ సర్కార్ మీద చంద్రబాబు మీద విమర్శలు చేశారు.

అయితే గాయం మానడానికి కొద్దిరోజులు సమయం పడుతుందన్న వైద్యుల సూచన మేరకు జగన్ పాదయాత్ర వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం Jagan హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ లో తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో YS jagan కు తెలంగాణ ప్రభుత్వం భారీ భద్రత కల్పించింది. బుల్లెట్ ప్రూప్ వెహికల్‌‌ను ప్రభుత్వం కేటాయించింది. అలాగే జగన్ ఇంటి వద్ద కూడా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసు శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

ప్రజా కూటమిగా ఏర్పడి KCR పై వార్ ప్రకటించిన చంద్రబాబు కు చెక్ పెట్టటానికి జగన్ పైన ఇంత శ్రద్ధ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. సెటిలర్స్ ఎక్కువగా వుండే చోట జగన్ కు మద్దతు ఇస్తే ఓటు బ్యాంకు చీలుతుందని భావనలో భాగమే జగన్ పైన టీ ఆపద్ధర్మ సర్కార్ చూపించే ప్రత్యేక శ్రద్ధ.

Related News