//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

'భార‌త జ‌ట్టులో క్రికెట్ ప్లేయ‌ర్ల హెల్మెట్ల‌పై జెండా ఉంటుంది. కానీ ధోనీ హెల్మెట్‌పై ఉండ‌దు. ఎందుకో తెలుసా..?

Category : world sports

ఇండియా మాజీ కెప్టెన్‌ మ‌హేంద్ర సింగ్ ధోనీ పేరు వినగానే హెలికాప్ట‌ర్ షాట్లు, ఎంత ఉత్కంఠ పరిస్థితులలోనైనా కూల్ గా ఉండే అతని స్వభావం, జట్టులోని ఆటగాళ్లను ఉత్సాహా పరిచే తీరు మ‌న‌కు గుర్తుకు వ‌స్తాయి. తన కెప్టెన్సీ లో భారత్ కు ఎన్నో అద్భుత విజయాలను అందించాడు ధోనీ. భార‌త జ‌ట్టుకు రెండు వ‌ర‌ల్డ్ క‌ప్ ల‌ను అందించడమే కాకుండా ఎన్నోఉత్కంఠ మ్యాచుల్లో జట్టును ఒంటి చేత్తో న‌డిపించి విజ‌య తీరాల‌కు చేర్చాడు.

గ్రౌండ్ లోని భారత జట్టులో ధోనీకి, మిగ‌తా ఆట‌గాళ్ల‌కు ఓ తేడా క‌నిపిస్తుంది. అది మీరు ఎప్పుడైనా గమనించారా?. దాని గురించి తెలుసుకునే ముందు క్రికెట్ దేవుడు స‌చిన్ టెండుల్క‌ర్ త‌న హెల్మెట్ మీద జాతీయ జెండాను పెట్టుకునే అలవాటు ఉంది. దీని మీద అప్పట్లో చాల విమర్శలు వచ్చాయి. రాను రాను ఇదే సాంప్ర‌దాయాన్ని మిగిలిన ఆటగాళ్లు పాటిస్తూ వస్తున్నారు. ఇప్పుడు టీమిండియాలో విరాట్ కోహ్లి త‌దిత‌ర ఇత‌ర ప్లేయ‌ర్స్ కూడా త‌మ త‌మ హెల్మెట్స్‌పై జాతీయ జెండాను పెట్టుకుంటున్నారు. కానీ మ‌హేంద్ర సింగ్ ధోనీ మాత్రం త‌న హెల్మెట్‌పై జాతీయ జెండాను పెట్టుకోడు.

కానీ దానికి పెద్ద కారణం ఉంది. అందుకే ధోని హెల్మెట్‌పై జెండాను పెట్టుకోడు. అదికూడా భారత జట్టు బౌలింగ్ చేసేటప్పుడు మాత్రమే. ధోనీ బ్యాటింగ్ చేసేట‌ప్పుడు మాత్రం జెండా ఉంటుంది. ధోని కీపింగ్ చేసే సమయంలో త‌న సౌక‌ర్యానికి అనుగుణంగా హెల్మెట్‌ను తీసి కింద పెడుతుంటాడు. ఆలా క్రింద పెట్టి మరల హెల్మెట్ ధరించేటప్పుడు జెండా ఉంటె దాన్ని అగౌర‌వ ప‌రిచిన‌ట్టే అవుతుంది క‌దా. అందుక‌నే ధోనీ త‌న హెల్మెట్‌పై జెండాను పెట్టుకోడు. ఇది దాని వెనుక ఉన్న అసలు కారణం. అంతే కానీ ధోనీకి జెండాపై గౌర‌వం లేక కాదు. ఒక వేళ తాను క్రికెటర్ కాకుంటే మిల‌ట‌రీలో చేరేవాడినని ధోని ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు.