//single page style gallary page

Reason for Anna canteens are shut down

Category : politics state

Click here to read this article in Telugu

"అన్న క్యాంటీన్లు" అర్ధాంతరంగా మూతబడ్డాయి... కారణం ఎవరు?

గత ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుపేదలకు అతి తక్కువ ధరలకే నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందజేసేందుకు నెలకొల్పిన "అన్న క్యాంటీన్లు" అర్ధాంతరంగా మూతబడ్డాయి. గురువారం ఉదయం రోజూ మాదిరిగానే ఈ ఫలహారశాలలకు అల్పాహారం, మధ్యాహ్నం భోజనం కోసం వెళ్లిన వారికీ అవన్నీ తాళాలు వేసి కనిపించాయి. గత కొన్ని నెలలుగా కేవలం రూ.15కి (అల్పాహారం, మధ్యాహ్న, రాత్రి భోజనాలకు రూ.5 చొప్పున) ప్రతి రోజూ కడుపు నింపుకొంటున్న వీరందరికీ తీవ్ర నిరాశ ఎదురైంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 204 క్యాంటీన్లు మూతబడ్డాయి. ఇప్పుడు రోజుకు వాటి కోసం ఎంత లేదన్నా కనీసం రూ.100 నుంచి రూ.120 వరకూ చెల్లించాల్సిన పరిస్థితి ఎర్పడింది. అక్షయపాత్ర ఫౌండేషన్‌ సంస్థ ఈ అన్న క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే.

వైసీపీ ప్రభుత్వం ఈ క్యాంటీన్ల స్థాపన, నిర్వహణలో పలు లొసుగులున్నాయని భావిస్తున్న నేపధ్యం లో గత నెల 31వ తేదీ నుండి ఆహారం సరఫరా చేయనవసరం లేదని అక్షయపాత్ర సంస్థకు కొన్ని రోజుల క్రితం సూచించింది. అయితే నిజానికి గత ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ సంస్థ కాంట్రాక్టు ఇంకా 2020 వరకూ ఉందని తెలిసింది. కాంట్రాక్టు కాలపరిమితి ఇంకా ఉండడం, అంతే కాకుండా తమకు ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయల బిల్లులు రావాల్సి ఉండడంతో ఈ సారి కూడా తమనే కొనసాగిస్తారని అక్షయపాత్ర నిర్వాహకులు భావించారు. పురపాలక శాఖాధికారులు కూడా అలాగే భావించి 31వ తేదీ రాత్రి లోగానే కొనసాగింపు ఉత్తర్వులు జారీ అవుతాయని చెబుతూ వచ్చారు. కానీ దీని పై బుధవారం రాత్రి వరకు ఏలాంటి ఆదేశాలు రాలేదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అక్షయపాత్ర ఫౌండేషన్‌ గురువారం ఉదయం నుంచి అన్న క్యాంటీన్లకు ఆహార సరఫరాను నిలిపివేసింది. అధికారులు పలు చోట్ల ఫలహారశాలలకు తాళాలు వేసి తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు.

ఇక ఇప్పుడు అర్ధాంతరంగా అన్నక్యాంటీన్లకు సరఫరా నిలిపేయడంతో నిరసనలు మొదలయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు 20వ వార్డులో ఏర్పాటుచేసిన క్యాంటీన్‌ కూడా మూతబడడంతో అక్కడకు వచ్చిన అన్నార్తులు ఉసూరుమంటూ వెనుదిరిగారు. అక్కడి టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వెంటనే స్పందించారు. అప్పటికప్పుడు రోడ్డుపై టెంట్‌ వేసి సుమారు 300 మందికి భోజనాలు వండించి వడ్డించారు. మంత్రి బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో రెండ్రోజుల క్రితం అన్నక్యాంటీన్లను కొనసాగిస్తామని ప్రకటించారని ఆయన గుర్తుచేశారు. అయినా మూసేశారని, వైసీపీ ప్రభుత్వ పాలన ఏ విధంగా అసత్యాలతో సాగుతోందో అని చెప్పుకొచ్చారు.

The "government canteens " that the previous government set up to provide quality and delicious food at the lowest prices for the poor in the state have been shut down. The restaurants on the same day in the morning for breakfast, noon meal and went for them and found all the locks. For the past few months, all those who have been filling their stomachs for only Rs.15 (breakfast, lunch and dinner at Rs. 5) have suffered a severe depression. There are 204 canteens closed nationwide . Now they have to pay at least Rs 100 to Rs 120 per day. The Akshayabhara Foundation is supplying food to the canteens.

In the wake of the YCP government's many loopholes in the establishment and maintenance of these canteens, the Akshaya Pathiksha has been advised by the Akshaya Pathiksha that there is no need to supply food since the 31st of last month. In fact, the contract with the previous government is known to be in contract until 2020. Akshay managers thought they would continue to do so, as there is still a contract deadline and they have to get billions of rupees from the government . The municipal authorities also felt that the continuation orders would be issued on the night of the 31st. But there were no orders until Wednesday night. Under strict conditions, the Akshayapatra Foundation has stopped providing food to the canteens since Thursday morning. Officers locked the cafeteria in several places and seized it.

Now immediately annakyantinlaku delivery protests were stopped. The canteen erected in the West Godavari district milk ward 20th Ward was also closed, leaving uninjured visitors. TDP MLA Nimla Ramanaidu responded immediately. About 300 people have cooked meals on the road from time to time. He recalled that Minister Botsa Satyanarayana had announced that he would continue the Annakantins in the Assembly. However, the YCP government's rule is covered with lies.