Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పవన్ పై సవితి ప్రేమ వొలక పోస్తున్న ఆ మీడియా ఛానెల్స్..ఎందుకో తెలుసా....?

Category : state politics

గత కొన్నేళ్లుగా మీడియా రంగంలో వచ్చిన విప్లవాత్మక మైన మార్పులు చూస్తూనే ఉన్నాం. సమాజంలో మీడియా అనేది ఎంత ప్రముఖ పాత్ర వహిస్తుందో తెలిసిందే. స్వాతంత్ర సంగ్రామం మొదలు కొని ఇప్పటి వరకు.... ప్రజా స్వామ్యాన్ని వంద రెట్లు ప్రభావం చూపించ గలిగె శక్తి ఒక్క మీడియాకే ఉందన్నది ప్రతి ఒక్కరికీ తెలిసిందే.కానీ గత కొన్ని ఏళ్లుగా మన తెలుగు రాష్ట్రాల్లోనీ మీడియా ఛానెల్స్ ని గమనిస్తే....కొన్ని పార్టీలకు మాత్రమే కొమ్ము కాస్తు... వారికి , వారి ఛానెళ్ల కు ఉపయోగపడే వార్తలనే నిజాలుగా చిత్రీకరిస్తూ...అసలు వాస్తవాలను పక్క దారి పట్టిస్తున్నారు.ఒక మతానికో లేదా ఒక వర్గానికో చెందిన ఛానెళ్లు గా ఉంటే ఇక పత్రిక స్వాతంత్రం, జర్నలిస్ట్ విలువలు, ప్రోటోకాల్ ఏమవుతుంది అన్నది సీనియర్ జర్నలిస్ట్ ల వాదన...

ప్రస్తుతం ఈ విషయాన్ని మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనే కదా మీ డౌట్ అక్కడికి వస్తున్న...గత కొన్ని నెలలుగా కొన్ని పార్టీల కే పరిమితమైన న్యూస్ ఛానెల్స్ తాజాగా అన్ని పార్టీలకు సంబంధించి అన్ని వార్తలను ప్రసారం చేస్తూ ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. ఇప్పటి వరకు జనసేన పార్టీ కి సంబంధించి గాని పవన్ కళ్యాణ్ సంబంధించి గాని ఏ ఒక్క వార్తను కూడా ప్రసారం చేయనటువంటి టీవీ-9 వంటి పలు ఛానెల్స్ తాజాగా ఆ పార్టీ తో పాటు అన్ని పార్టీలకు సంబంధించిన వార్తలు ప్రసారం చేయడం వెనుక అనేక అనుమానాలు వస్తున్నాయి. ఒక కొత్త పార్టీ రాజకీయాల్లోకి వచ్చినపుడు దానిని ప్రతి ఒక్కరూ ఆహ్వానించ దగ్గ విషయం.కాని ఇప్పటి వరకు జనసేన పార్టీ నీ ఏ మీడియా ఛానెల్ కూడా వాటికి సంబంధించిన వార్తలు ప్రసారం చేయలేదు.తాజాగా మీడియా లో వచ్చిన ఈ రకమైన మార్పును హర్షించాలా లేక వారు ప్లే చేస్తున్న గేమ్ రోల్ అనుకోవాలా అన్నది అర్థం కాని పరిస్థితి.

అసలైన వాస్తవాలు ప్రజలకు చూపించడం కోసమే జర్నలిస్ట్ విలువలు పాటుపడ వలసిన నేపధ్యంలో.సవతి ప్రేమ వొలకపొస్తు కొన్ని పార్టీలకే కొమ్ము కాస్తు ఉండడం చూస్తూనే ఉన్నాం. సరిగ్గా ఈ సమయంలోనే పూర్తి గా జనసేన తమ కార్యక్రమాలను, సమావేశాలను, ప్రజా సమస్యల పట్ల తమకున్న అంకిత భావాన్ని కేవలం సోషల్ మీడియా ఛానెళ్ల ద్వారా జనాలకు తెలియజేస్తూ ఇన్నాళ్లు కొనసాగుతూ వచ్చింది.ఇంత భారీ స్థాయిలో జనసేన ప్రజాదరణ పొందడం వెనుక పవన్ కళ్యాణ్ మ్యానియా అనే చెప్పుకోవాలి. ఆయనకు ప్రజల్లో ఉన్న ఫాలోయింగ్, గుర్తింపు మొన్న జరిగిన ఎన్నికల్లో అంతా బలమైన స్థాయిలో నిలిచేలా ప్రేరేపించాయి.ఈ సమయంలోనే ఆయన మీడియా వ్యవహరిస్తున్న పక్షపాత వైఖరిని నిరసిస్తూ సొంత ఛానెల్ ని పెట్టే వైపుగా నడిపించాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ పై వార్తలు ప్రసారం చేయడం లో పలు ఛానెళ్లు వ్యవహరిస్తున్న తీరు సైతం అనేక అనుమానలకు తావిస్తున్నయి .ముఖ్యంగా రెండు అంశాలు వారు వ్యవహరిస్తున్న తీరును విషదికరిస్తున్నాయి.అందులో ఒకటి మే23 న వెలువడనున్న ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ సైతం తమ పూర్తి బలాన్నిచూపించేలా ఉంది. అందులో భాగంగా ఆ పార్టీ కి 20 నుంచి 30 సీట్లు గనుక వస్తే రాష్ట్ర రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది.అందుకే ఆయా పార్టీలకు చెందిన ఛానెల్స్ పోటీ పడి మరి జనసేనను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అలాగే గత కొన్ని రోజులుగా మీడియా రంగంలో వచ్చిన మార్పుల కారణంగా గాని వారు ఈ రకమైన నిర్ణయం తీసుకుని ఉండవచ్చు అన్నది అందరిలో ఉన్న వాదన. ఈ రకమైన నూతన మార్పులు కేవలం ఎన్నికల ఫలితాల వరకేనా లేక ఆ తరువాత కూడా టీవి ఛానెల్స్ ఈ రకమైన ప్రసారాలు చేయనుందా లేదా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి వుంది.

Related News