//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బుల్లితెర నటి ఝాన్సీ మరణానికి రీజన్ ఇదే

Category : state

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు 'పవిత్రబంధం' సీరియల్ తో సుపరిచితురాలు అయిన ఝాన్సీ కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని అపార్ట్ మెంట్ లో ఉరి వేసుకుని . మరణించారు. మొదట పోలీసులు ఝాన్సీ మరణం సహజ మరణం అని ఆత్మ హత్య అని భావించారు. అయితే ఝాన్సీ కుటుంబ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో ఆమె ప్రియుడు సూర్య తేజ ను విచారించారు. అతడు మానసికంగా వేదించడం వల్లే ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడ్డట్లుగా పోలీసులు నిర్థారణకు వచ్చారు.

తాజాగా పోలీసులు సూర్య తేజను అరెస్ట్ చేసి సిటీ కోర్టులో హాజరు పరిచారు. రెండు వారాల పాటు సూర్య తేజకు జ్యుడీషియల్ కస్టడీని కూడా విధించారు. పంజాగుట్టా పోలీస్ కమీషనర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఝాన్సీ ఆత్మహత్యకు సూర్య తేజ వేదింపులు కారణం అంటూ పేర్కొన్నాడు. ఝాన్సీని నటనను వదిలేయాల్సిందిగా సూర్య తేజ పదే పదే వేధించేవాడని దాంతో పాటు ఆమె ప్రతి కదలికపై నిఘా పెట్టడంతో పాటు ఆమె ఏం చేసినా కూడా అనుమానించడం అవమానించడం చేసేవాడిని విచారణలో వెల్లడైనట్లు గా తెలుస్తోంది.

దీంతో ఆమె తీవ్ర మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. గత నవంబర్ లో నటన వదిలేస్తేనే మా తల్లిదండ్రులు మన పెళ్లికి ఒప్పుకుంటారంటూ చెప్పాడట. సూర్య తేజ కోసం నటనను సైతం వదిలి పెట్టడానికి సిద్ధమైన ఝాన్సీ, అనుక్షణం అనుమానిస్తూ అవమానిస్తూ మానసికంగా వేదింపులకు గురి చేస్తున్న సూర్య తేజ తీరు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆమె మరణానికి సూర్య తేజ వేధింపులే కారణమని సూర్య తేజ ని చేసిన విచారణలోనూ, సెల్ ఫోన్ లలో లభించిన సమాచారం తోనూ నిర్ధారణకు వచ్చారు పోలీసులు.

Related News